Begin typing your search above and press return to search.
వెడ్డింగ్ కార్డ్ లు 20 వేలకు కొనుక్కున్నారా?
By: Tupaki Desk | 1 Sep 2015 8:08 AM GMTకన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తనయురాలు నిరుపమ రాజ్ కుమార్ నిన్నటిరోజున పెళ్లికూతురైన సంగతి తెలిసిందే. ఈ వివాహమహోత్సవానికి వేలాదిగా అభిమానులు తరళివచ్చారు. ఇదే వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి ప్రముఖులు ముఖ్య అతిధులుగా పిలుపు అందుకున్నారు.
అయితే ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు శివరాజ్ కుమార్ అభిమానులు పోటీపడ్డారు. అంతేకాదు ఎన్నడూ లేనంతగా వెడ్డింగ్ కార్డుల్ని బ్లాక్ లో కొనుక్కుని మరీ పెళ్లికి హాజరయ్యారు. దీనికోసం ఒక్కో అభిమాని దాదాపు 10వేల నుంచి 20వేలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంతకాలం బ్లాక్ లో టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన అభిమానుల్ని, బ్లాక్ లో పాస్ లు కొనుక్కుని ఆడియో వేడుకలకు వెళ్లిన అభిమానుల్ని చూశాం. కానీ ఇలా బ్లాక్ లో వెడ్డింగ్ కార్డ్ లు, పాస్ లు కొనుక్కుని పెళ్లికి వెళుతున్న అభిమానుల్ని చూడడం అరుదైన విషయమే. అయితే తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఆమాత్రం ఆరాటపడడం సహజమే.
ఈ పెళ్లిలో దాదాపు 50వేల మంది అతిధులు పాల్గొన్నారు. వారి రక్షణ కోసం 3000 మంది పోలీసులు సెక్యూరిటీగా వచ్చారు. కేవలం ఈ ఒక్క వేడుక కోసం 15 కోట్లు ఖర్చయ్యింది. ఇంతవరకూ టాలీవుడ్ లో టాప్ హీరోల పెళ్లిళ్లకే ఖర్చవ్వనంత బడ్జెట్ ఇది. సినీచరిత్రలో కనీవినీ ఎరుగనంత గ్రాండ్ గా ఈ వివాహం జరిగింది. అయినా సరే బ్లాకులో టిక్కెట్లేంటి బాసూ? టివిల్లో చూసి ఎంజాయ్ చేయొచ్చుగా? సినిమాలు చూసేది తెర మీదేగా, లైవ్ లో కాదుగా చూసేది.