Begin typing your search above and press return to search.

రెస్ట్‌ రూం కూడా లేక ఇబ్బంది పడిందట!

By:  Tupaki Desk   |   26 July 2019 1:02 PM GMT
రెస్ట్‌ రూం కూడా లేక ఇబ్బంది పడిందట!
X
జీవిత రాజశేఖర్‌ ల చిన్న కూతురు శివాత్మిక 'దొరసాని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకున్న శివాత్మిక ముందు ముందు కమర్షియల్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతానంటోంది. తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దొరసాని' చిత్రం షూటింగ్‌ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

ఒక రాత్రి సమయంలో కోట పైన చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. అప్పుడు పైకి వెళ్తున్న సమయంలో మేడమ్‌ మీరు రెస్ట్‌ రూమ్‌ యూజ్‌ చేయాలంటే ఇప్పుడే చేసుకోండి. పైకి వెళ్లాలంటే 20 నిమిషాలు పడుతుంది. అక్కడ ఇబ్బంది అవుతుంది. రాత్రి మొత్తం షూటింగ్‌ చేస్తామని అన్నాడు. నేను డ్రస్‌ మార్చుకోవడం కూడా ఇబ్బంది అయ్యింది. కింద కార్‌ వాన్‌ ఉంది. పైన చాలా ఇబ్బంది మద్య షూటింగ్‌ పూర్తి చేశాం.

పైకి ట్రాక్‌ పై వెళ్లిన నేను.. ఒక గుహలాంటి చోట డ్రస్‌ మార్చుకున్నాను. అప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడే అక్క వచ్చింది. అక్కడ భోజనం తీసుకు వస్తే చేశాను. అక్క తీసుకు రాకుంటే ఆ రోజు రాత్రి భోజనం చేసేదాన్నే కాదని శివాత్మిక చెప్పుకొచ్చింది. రెండవ సినిమా విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంది.