Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఆఫర్ కి నో చెప్పేసిందట
By: Tupaki Desk | 25 April 2016 4:28 AM GMTతెలుగోడి గుండె చప్పుడుగా నిలిచిన తెలుగు ప్రముఖులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీవోడు ముందువరుసలో ఉంటారు. తెలుగువాళ్లకు ఒక ఉనికి అంటూ లేక.. మద్రాసీలుగా పిలిపించుకునే దైన్యం నుంచి.. తెలుగోళ్లకు ఒక ఉనికిని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయ నేతగానే కాదు.. వెండితెర మీద ఓ రేంజ్ లో వెలిగిపోయిన ‘అన్న’ ఇమేజ్ ఎంతన్నది ప్రతి ఒక్క తెలుగువారికి తెలిసిందే.
సాంఘిక.. జానపద సినిమాల్ని పక్కన పెడితే.. పౌరాణిక సినిమాల్లో ఆయన దేవతామూర్తులకు నిలువెత్తు రూపంలా కనిపించటమే కాదు.. రాముడు.. కృష్ణుడు అంటే ఎన్టీవోడిని మాత్రమే మదిలో గుర్తు తెచ్చుకునే తెలుగువారికి కొదవలేదు. మరి.. అలాంటి మహానుభావుడు పిలిచి మరీ తన సినిమాలో నటించే అవకాశం ఇస్తే.. ఎగిరి గంతేయటం ఖాయం. కానీ.. అలాంటి అపురూప అవకాశాల్ని సైతం కాలదన్నుకొని.. తాను నమ్ముకున్న నృత్యకళకే అంకితమైన కళాకారిణి శోభానాయుడు. తెలుగు తెర మీదకు సరిగ్గా సూట్ అయ్యే అందచందాలతో ఉన్న ఆమెకు వచ్చిన అవకాశాలెన్నో.
అలాంటి ఆమె తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తనకు ఎన్టీఆర్.. ఎఏన్నార్ తమ తమ సినిమాలకు ఆఫర్లు ఇవ్వటం.. తాను కుదరదని తేల్చి చెప్పిన వైనాన్ని ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అక్కినేనికి తాను వీరాభిమానినని.. అంజలీదేవి కొడుకు పెళ్లికి వచ్చిన నన్ను అక్కినేని.. తనను అంజలీదేవి ద్వారా సినిమాల్లో నటించాలన్న రాయబారాన్ని నడపటాన్ని గుర్తు చేసుకున్నారు.
సినిమా ఆఫర్ గురించి చెప్పిన అంజలీదేవి తన చేతిలో డబ్బు పెట్టారని..కానీ తాను మాత్రం వద్దంటే వద్దని చెప్పి ఆఫర్ ను వదులుకున్నట్లు వెల్లడించారు. ఇలా ఎందరో తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక.. ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం గురించి ఆమె చెప్పుకొచ్చారు.
‘‘హైదరాబాద్ వచ్చాక ఒకసారి నాచారానికి పిలిచారు. నేను వెళ్లే సమయానికి ఆయన శ్వేత వస్త్రాలతో మెరిసిపోతున్నారు. నాకు తెలుసు మీరు సినిమాల్లో చేయరంటూ నావైపే చూస్తే.. మహర్షి విశ్వామిత్ర చిత్రంలో తప్పకుండా మీరే చేయాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను’’ అని అడిగేయటంతో అవాక్కు అయ్యా’’ అని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ ఆఫర్ ను వద్దని చెప్పటానికి చాలానే ఇబ్బంది పడ్డానని వెల్లడించారు. అంత పెద్ద మహానుభావుడే స్వయంగా ఛాన్స్ ఇస్తానన్నా.. వద్దంటూ తిరస్కరించటం మామూలు విషయం కాదనే చెప్పాలి.