Begin typing your search above and press return to search.

వారికి ఆ ఛాన్స్ ఇవ్వని శోభిత..!

By:  Tupaki Desk   |   27 April 2023 5:31 PM IST
వారికి ఆ ఛాన్స్ ఇవ్వని శోభిత..!
X
శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయే కానీ బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడ సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. ఈమధ్యనే తెలుగు సినిమాలు చేస్తూ అలరిస్తుంది శోభిత. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 1, 2 భాగాల్లో కూడా శోభిత నటించింది.

పిఎస్ 2 శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు శోభిత. సినిమాల కన్నా ఆమె మిగతా విషయాల్లో ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. అంతకుముందు శోభిత ఫోటో షూట్స్ వైరల్ గా మారాయి.

అమ్మడు షేర్ చేసే హాట్ ఫోటో షూట్స్ చూసి ఆడియన్స్ ముక్కున వేలేసుకున్నారు. అంతకుముందు అడివి శేష్ తో శోభిత క్లోజ్ గా ఉంటుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా నాగ చైతన్యతో అమ్మడు డేటింగ్ లో ఉందని అంటున్నారు.

నాగ చైతన్య, శోభిత కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు మరి ఈ ఇద్దరికి ఎక్కడ ఫ్రెండ్ షిప్ కుదిరిందో కానీ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మీడియా హడావిడి చేస్తుంది. అటు చైతు కానీ శోభిత కానీ ఈ విషయంపై నోరు విప్పలేదు. కానీ చైతన్య రీసెంట్ ఫోటోల్లో వెనక శోభిత ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే పిఎస్ 2 ప్రమోషన్స్ లో శోభిత ఇంటర్వ్యూ ఇచ్చినా నాగ చైతన్య తో డేటింగ్ ప్రశ్నలు అడగకుండా చేసుకుంది. ముందే అలర్ట్ చేసిందా లేక లేదా అలాంటి ప్రశ్నలు అడగకండి అని తన పి.ఆర్ తో చెప్పించిందా అన్నది తెలియదు కానీ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన స్టార్స్ ని వారి మీద వస్తున్న వార్తలపై స్పందన అడిగే మీడియా వారిని శోభిత క్లేవర్ గా మేనేజ్ చేసిందని అంటున్నారు.

ప్రస్తుతానికి అమ్మడు ఈ ప్రశ్నల నుంచి తప్పించుకున్నా చైతన్యతో అమ్మడి మ్యాటర్ ఏంటి అన్నది తేలే వరకు ఎక్కడో ఒకచోట శోభితని టార్గెట్ చేస్తూనే ఉంటారు. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్న శోభితకు ఇదొక హెడేక్ గా మారిందని చెప్పొచ్చు.