Begin typing your search above and press return to search.
చైతూ తో డేటింగ్, నోరు విప్పిన శోభితా
By: Tupaki Desk | 8 May 2023 9:25 PM ISTఅక్కినేని యువ హీరో నాగ చైతన్య , తెలుగు హీరోయిన్ శోభితా దూళిపాళ్ల ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి షికార్లు కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఓ రెస్టారెంట్ నాగచైతన్య ఫోటోని షేర్ చేయగా, అందులో వెనక శోభితా కూడా కనిపించింది. అంతే, ఇక వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు రావడం మొదలైంది. ఈ రూమర్స్ పై ఇప్పుడిప్పుడే వారు స్పందించడం మొదలుపెట్టారు.
కస్టడీ మూవీ ప్రమోషన్స్ సమయంలో నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు. డైరెక్ట్ గా శోభిత పేరుఎత్తలేదు.కానీ , సంబంధం లేని మూడో వ్యక్తిని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు అని ఆయన పేర్కొన్నారు. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం కూడా శోభిత తో రిలేషనే అంటూ రూమార్స్ వచ్చాయి. అందుకే చైతూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తనకు, శోభితకు ఎలాంటి సంబంధం లేదు అని అర్థం వచ్చేలా చైతూ మాట్లాడారు.
కాగా, ఇంతకాలం కామ్ గా ఉన్న శోభితా కూడా స్పందించడం గమనార్హం. తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పింది. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొంది. తాను తప్పు చేయనప్పుడు మీడియా ముందకు వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు కదా అంది.
తనకు ఈ విషయంపై మాట్లాడాలని అనిపించలేదని, అందుకే మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది. తాను ఏ తప్పు చేయలేదని తనకు తెలుసని, జీవితంలో మంచిగా, ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే విషయంపై తాను ఫోకస్ పెడతానంటూ చెప్పడం విశేషం.
ఇక తన సినిమాల విషయానికి వస్తే, మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పింది. తనకు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని, తాను క్లాసికల్ డ్యానర్ అని చెప్పింది. మణిరత్నం సినిమా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డ్యాన్స్ చేయడం తన కల అని, అది నేరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక, తనపై వచ్చే రూమర్స్ ని తాను పట్టించుకోనని చెప్పకనే చెప్పింది.
తమ మధ్య ఏమీ లేదు అని ఓ వైపు చైతూ, మరో వైపు శోభితా క్లారిటీ ఇచ్చారు. మరి వీరి వివరణ తర్వాత అయినా, ఈ రూమర్స్ కి పులిస్టాప్ పడుతుందో లేదో చూడాలి. కాగా, చైతూ కస్టడీ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరో వైపు శోభితా ఇటీవల పొన్నియన్ సెల్వన్ తో అలరించింది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.