Begin typing your search above and press return to search.
శోభితపై లుక్కేయండి గురూ!
By: Tupaki Desk | 20 July 2016 1:30 PM GMTతెలుగమ్మాయిలకి పొరుగు భాషల్లో ఆఫర్లొస్తాయేమో కానీ తెలుగు సినిమాల్లో మాత్రం వాళ్లకి చోటుండదు. ఇదివరకంటే తెలుగమ్మాయిలు హీరోయిన్లు అవడానికి వెనకా ముందూ చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వాళ్లూ బాలీవుడ్ భామలకి పోటీపడుతూ తెరపై కనిపిస్తున్నారు. గ్లామర్ విషయంలోనూ అసలేమాత్రం లోటు రానీయడం లేదు. కానీ మన దర్శకనిర్మాతలే వాళ్లని నిర్లక్ష్యం చేస్తున్నారు. చంకలోనే పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు... మన దగ్గరే హీరోయిన్లున్నా మొత్తం దేశమంతా చుట్టొస్తుంటారు.
ఇటీవల కాలంలో హీరోలంతా సినిమాలతో బిజీ అవడంతో హీరోయిన్ల సమస్య తీవ్రమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలుగమ్మాయిలకి ఆఫర్లు రాకపోవడం గమనార్హం. అసలు ఇండస్ట్రీ ఆ దిశగా ఆలోచించకపోవడమే లేదనిపిస్తోంది. అందాల పోటీల్లో సత్తా చాటి బాలీవుడ్ లో ఆఫర్లు అందుకొంటోంది శోభిత దూలిపాళ్ల. ఆమె పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. రెండు మూడు సినిమాలకి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు నిర్మాతలు. కానీ మనవాళ్లు మాత్రం ఆమె గురించి అస్సలు ఆలోచించడం లేదు. మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ కోసం తిరగని ఇండస్ట్రీ లేదు. కానీ శోభిత గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించలేదు. నిజానికి మహేష్ పక్కన ఆమె బాగుంటుందనేది పరిశీలకుల మాట. రామన్ రాఘవ్ 2.0 అనే హిందీ సినిమాతో ఇటీవలే ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె నటన బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకుంది. మరి తెలుగు జనాల దృష్టిలో ఎప్పుడు పడుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న. గుంటూరు - విజయవాడ నేపథ్యమున్న శోభిత విదేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చింది. ఇక తెలుగు సినిమా హీరోయిన్ కావడానికి అంతకంటే అర్హతలు ఏముండాలి? మరి ఆమె తెలుగుతెరపై కనిపించేది ఎప్పుడో!