Begin typing your search above and press return to search.
`బాహుబలి`టైమ్ లో రాజమౌళి అంతమాటన్నారా?
By: Tupaki Desk | 17 Sep 2022 2:30 AM GMTటాలీవుడ్ దిశని, దశని ఒక్కసారిగా మార్చిన పాన్ ఇండియా సంచలనం `బాహుబలి`. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీని రాజమౌళి అత్యంత సాహసోపేతంగా రూపొందించిన విషయం తెలిసిందే. తొలి పార్ట్ ని రూ. 180 కోట్లతో పార్ట్ 2ని రూ. 250 కోట్లతో అత్యంత భారీ స్థాయిలో ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. దేశ వ్యాప్తంగా ఈ మూవీ పాన్ ఇండియా సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచి ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్ లకు ధైర్యాన్నిచ్చింది.
కంటెంట్ వుంటే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నిరూపించడమే కాకుండా టాలీవుడ్ కు వరల్డ్ వైడ్ గా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో మార్కెట్ ని క్రియేట్ చేసి ఎంత మందికి సరికొత్త దారులని చూపించి తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని రికార్డు స్థాయికి పెంచింది. అయితే ఈ రిస్కీ ప్రాజెక్ట్ ని కొంత భాగం చిత్రీకరించాక రాజమౌళి మధ్యలోనే ఆపేద్దామని షాకిచ్చారట.
అయితే జక్కన్న ఈ షాకింగ్ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? దీనికి నిర్మాతలతో ఒకరైన శోభు యార్లగడ్డ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారన్నది ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించి షాకిచ్చారు. అంతే కాకుండా ఓటీటీ కి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఓటీటీ బెటరా, లేక థియేటర్ బెటరా అనే దానిపై కూడా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆర్కా మీడియాని 2001లో ప్రారంభించామని, టెలివిజన్ షోస్ తో స్టార్ట్ చేశామన్నారు.
2009లో రాజమౌళి చేసిన `మర్యాదరామన్న`తో మాకు ఫస్ట్ బ్రేక్ లభించింది. అయితే రాజమౌళి `బాహుబలి`ని స్టార్ట్ చేశాక మనం అనుకున్న బడ్జెట్ ని మించి పోతోంది. దీన్ని ఇక్కడితో ఆపేద్దాం.. వేరే కథ చేద్దాం అన్నారట. అయితే శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని మాత్రం లేదు రిస్క్ తీసుకుని చేద్దాం అని రాజమౌళితో అన్నారట. రిస్క్ తీసుకున్నాం కాబట్టే `బాహుబలి` ఈ రేంజ్ లో భారీ విజయాన్ని సాధించిందని శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.