Begin typing your search above and press return to search.
కోడైరెక్టర్ పనులు చేపట్టిన నిర్మాత!
By: Tupaki Desk | 4 July 2015 7:30 PM GMTరెండున్నర సంవత్సరాలు రేయింబవళ్లు ఎంతో శ్రమించి 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. భారీ బడ్జెట్, భారీ కాన్వాస్, భారీ ప్రణాళికతో ముందుకెళ్లారు. అయితే ఇలాంటి ఓ బృహత్తర ప్రయత్నం సామాన్యుల వల్ల సాధ్యం కాదు. జక్కన్న అకుంఠిత ధీక్ష వల్లే సాధ్యమైంది. అంతేనా రాజమౌళితో పాటు ఇతర టీమ్ కూడా అంతే తీవ్రంగా కఠోర ధీక్ష చేపట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ పయనంలో బాహుబలి విజయవంతంగా తెరకెక్కడానికి సిసలైన కారకులు నిర్మాత శోభు యార్లగడ్డ అని చెబుతున్నారు బాహుబలి. ఆయనే ఈ చిత్రానికి వెన్నెముక అని పొగిడేస్తున్నారు.
ఒకానొక సందర్భంలో ఒత్తిడిని తట్టుకోలేక అప్పటికే పనిచేస్తున్న కోడైరెక్టర్ ప్రాజెక్టు వదులుకుని వెళ్లిపోతే ఆ బాధ్యతల్ని భుజాన వేసుకుని ఎంతో శ్రమించారని చెప్పారు. శోభు లేకపోతే ఈ సినిమా లేనేలేదు. ఓ వైపు సెట్‌లో అన్ని విభాగాలతో కోఆర్డినేషన్ చేస్తూనే అటు విఎఫ్‌ఎక్స్ కంపెనీలతో మంతనాలు సాగించారు. ప్రతిదీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు అసలు ఈ కథని నమ్మి సెట్స్‌కెళ్లడానికి కారకులు ఆయనే. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు అని అందరిలోనూ నమ్మకం పెంచారాయన. అంతేనా ముందస్తు ప్రణాళికతో విదేశాల్లోనూ ప్రచారం చేశారు. అసలు శోభు భగీరథ ప్రయత్నం వల్లే ఇది సాధ్యమైంది అంటూ రాజమౌళి ఆకాశానికెత్తేశారు.