Begin typing your search above and press return to search.

బాహుబలి విజయంపై అనుమానించారు -శోభు

By:  Tupaki Desk   |   4 Sep 2016 11:30 AM GMT
బాహుబలి విజయంపై అనుమానించారు -శోభు
X
బాహుబలి.. టాలీవుడ్ చరిత్రను తిరగరాసి.. ఎవరూ అందుకోలేని రికార్డులు సృష్టించిన మూవీ ఇది. ఇంత విజయాన్ని ముందే ఊహించడం ఎవరికైనా కష్టం. కానీ తాము చేసే పనిపై నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ విజయం జక్కన్నకు మాత్రమే సొంతం కాదు.. అంతగా ఆయన్ని నమ్మి సినిమా నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డది కూడా.

అయితే.. బాహుబలి సినిమాకి అనుకున్న దాని కంటే చాలా ఎక్కువగా బడ్జెట్ పెరిగిపోయినపుడు.. చాలామంది అనుమానించారట. సక్సెస్ సాధ్యమేనా.. పెట్టుబడి అంతా రికవర్ అవుతుందా అనే ప్రశ్నలు వేశారట. అయినా సరే నమ్మి విజయం అందుకున్న ఈ నిర్మాత.. ' ఫెయిల్యూర్ అంటే అనుకున్న వరకూ చేరలేకపోయామని అర్ధం. అంతే కానీ ప్రయత్నం చేయలేదని కాదు.. మరింతగా ప్రయత్నిస్తే సక్సెస్ ఎప్పుడూ సాధ్యమే. బడ్జెట్ పెరిగిపోయినపుడు బాహుబలి విజయంపై చాలామంది అనుమానించారు.. బెస్ట్ అందిస్తే ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. ప్రేక్షకులే అందరి కంటే ఉత్తమ న్యాయ నిర్ణేతలు' అని చెప్పారు.

బాహుబలి2 కోసం తన కంటే ఎక్కువగా రాజమౌళి కష్టపడుతున్నాడని.. తన పాత్ర పరిమితమే నిజాయితీగా ఒప్పుకున్న శోభు యార్లగడ్డ.. రెండో భాగం విజయంపై కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఈ స్థాయి విజయం సాధించిన తర్వాత ఆ మాత్రం నమ్మకం సహజమే కానీ.. కష్టం అంతా రాజమౌళిదే చెప్పడం ప్రశంసించాల్సిన విషయం.