Begin typing your search above and press return to search.
బుల్లి తెర పై మాహిష్మతి మాత చరిత్ర
By: Tupaki Desk | 19 Aug 2017 7:28 AM GMTబాహుబలి సినిమా విజయం తరువాత అందరూ వాళ్ళ వాళ్ళ తదుపరి ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. రాజమౌళి తన కొత్త సినిమా కోసం కథను సిద్దం చేసుకుంటూ ఉంటే హీరోలు రానా - ప్రభాస్ వాళ్ళ కొత్త ఫిల్మ్ ప్రాజెక్టులతో స్పీడ్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు బాహుబలి లాంటి గొప్ప సినిమాను నిర్మించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని ఏమి చేయబోతున్నారు అనేది ఫిల్మ్ నగర్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. కొంతమంది వాళ్ళకి థర్డ్ పార్టీ గా ఉండి సినిమాలు నిర్మించాలనే ఆలోచన కూడా ఉందని అంటున్నారు.
అయితే బాహుబలి చిత్ర నిర్మాత ఈ మద్య ఒక వేదికపై తన కొత్త ప్రాజెక్టు గురించి చెప్పి అందరి ఆసక్తికీ ఒక సమాధానం ఇచ్చాడు. ‘ఇండియన్ ఫోక్లోర్ టు సెల్యులాయిడ్’ అనే ఒక విషయంపై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో ఒక క్లాస్ తీసుకుంటున్నప్పుడు శోభు మాట్లాడుతూ “బాహుబలి లాంటి జానపదం నిర్మించాలని మేము ఈ సినిమా మొదలు పెట్టలేదు. అలా తియ్యడానికి సరిపడే కథ దొరికింది కాబట్టి బాహుబలిని నిర్మించాం” అని అన్నాడు. ఇంకా తను త్వరలో చేయబోతున్న మినీ టివి సిరీస్ గురించి కూడా చెప్పాడు. ''ఈ మినీ టివి సిరీస్ ‘రైజ్ ఆఫ్ శివగామి’ అనే పుస్తకం ఆదారంగా నిర్మించబడుతుంది. ఈ టివి సిరీస్ కూడా గొప్ప యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. దీన్ని పెద్ద్ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ కథ మొత్తం మాహిష్మతి మాత శివగామి ఆమె చిన్నతనం నుండి ఆమె రాజ్యాన్ని ఎలా కాపాడింది అనేదే ఉండబోతోంది'' అని తెలిపారు. బాహుబలిలో ఉండే అన్ని పాత్రలూ ఇందులో ఉంటాయి కానీ వాళ్ళ చిన్న వయసులో జరిగే కథగా ఉంటుందట. ఇందులో నటించబోయే నటీనటులు కూడా వేరే ఉంటారట.
ఇప్పటికే దేవసేన పాత్ర ఆధారంగా ఒక టివి సిరీస్ హిందీలో వస్తోంది. ఈ దేవసేన గా మల్లూ హీరోయిన్ కార్తికా నాయర్ చేస్తోంది. ఈ టివి సిరీస్ కు బాహుబలి రచయత విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. అయితే ఇప్పుడు శోభు నిర్మించబోతోన్న టివి సిరీస్ కు ఎవరు కథ కథనం అందిస్తున్నారో ఎవరు శివగామిగా నటించబోతోన్నారు అనేది ఇంకా పూర్తిగా తెలియవలసి ఉందిలే.