Begin typing your search above and press return to search.

బాహుబలి నిర్మాతకు ఒళ్లు మండింది

By:  Tupaki Desk   |   6 Jun 2018 5:31 PM IST
బాహుబలి నిర్మాతకు ఒళ్లు మండింది
X
బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డకు కోపం వచ్చింది. తమ సినిమాకు సంబంధించిన ఆర్థిక విషయాలపై ఊహాగానాలతో కూడిన నెగెటివ్ ఆర్టికల్ రాసిన వాళ్లపై ఆయన మండిపడ్డాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ‘బాహుబలి’ సినిమాకు ఫైనాన్స్ చేసిన రామోజీ రావుకు.. దర్శకుడు రాజమౌళికి తీవ్ర విభేదాలు నెలకొన్నాయంటూ ఒక కథనంతో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ సింహభాగం రామోజీ ఫిలిం సిటీలోనే జరిగిన సంగతి తెలిసిందే. ముందు డబ్బులేమీ తీసుకోకుండా ఇలా సినిమాకు సహకరించడంతో పాటు.. రామోజీ ఫైనాన్స్ కూడా సమకూర్చినట్లు ఊహాగానాలున్నాయి.

ఇదిలా ఉంటే విడుదల తర్వాత ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏవో తేడాలొచ్చాయని.. రూ.90 కోట్లకు రామోజీ బిల్ ఇవ్వడంతో రాజమౌళి హర్టయ్యాడని.. ఈ నేపథ్యంలో రామోజీతో సంబంధాలు బెడిసికొట్టాయని.. ఇకపై తన సినిమాలేవీ ఫిలిం సిటీలో షూట్ చేయొద్దని నిర్ణయించుకున్నాడని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ కథనంపై శోభు యార్లగడ్డ స్పందించాడు. జనాల దృష్టిని ఆకర్షించడానికి ఇలా లేని పోని ఊహాగానాలు ప్రచారం చేయొద్దని.. పతనం అయిపోవద్దని ఆయన అన్నారు. ఇలాంటి వార్తలతో క్రెడిబిలిటీ దెబ్బ తిని.. గాసిప్ వెబ్ సైట్ గా పేరొస్తుందని విమర్శించారు. ఎల్లో జర్నలిజం అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారాయన.