Begin typing your search above and press return to search.
బాహుబలి ముందు రావడం మంచిదైందట
By: Tupaki Desk | 20 Sept 2015 10:07 AM ISTకోడిగుడ్డు మీద ఎన్ని వెంట్రుకలు పీకినా బాహుబలి అనే సినిమా నిజంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణం. ఈ విషయాన్ని యావత్ భారతదేశమే కాక అంతర్జాతీయ స్థాయిలో సైతం ఆమోదించారు. అయితే ఈ సినిమాకు సైతం మొదట్లో నీలాపనిందలు తప్పలేదు. బాహుబలి ప్రచారంలో సందర్భంగా విడుదల చేసిన మొదటి పోస్టరే ఒక ఆంగ్ల చిత్రానికి సంబంధించిన పిక్ అని దుమారం రేగడం దగ్గరనుండి. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ట్రాయ్ - 300 - ఆలేగ్జాండర్ నుండి ఎత్తుకోచ్చారని, కీలక సన్నివేశాలను బెన్ హార్ చిత్రం నుండి స్పూర్తి పొందారని ఎవరికీ నచ్చిన వ్యాఖ్యలు వారు చేస్తూపోయారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకూ దర్శకుడు గానీ నిర్మాతలు గానీ స్పందించలేదు.
కట్ చేస్తే ఇటీవల విడుదలైన ఇంగ్లీష్ మూవీ 'జంగిల్ బుక్' ట్రైలర్ అందరినీ అలరించింది. ఆ ట్రైలర్ లో చూపించిన జలపాతం అత్యంత నేచురల్ గా వుండడంతో బాహుబలిని పోలిన జలపాతమని సోషల్ మీడియాలో షేర్ కి గురయ్యింది. ఈ షేర్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ "జంగిల్ బుక్ కంటే బాహుబలి సినిమా ముందు విడుదలవడం మంచిదైంది. లేదంటే మన స్నేహితులు కొంతమంది ఏమని చెబుతారో మీకు తెలిసిందే" అంటూ విమర్శకులపై ఇన్ డైరెక్ట్ పంచ్ వేశాడు