Begin typing your search above and press return to search.
నయనతార 'కనెక్ట్' మూవీకి బిగ్ షాక్ !
By: Tupaki Desk | 20 Dec 2022 8:40 AM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంత కాలంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకే ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తూ తనదైన ప్రత్యేకతని చాటుకుంటుకుంటోంది. నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ హారర్ థ్రిల్లర్ ని నిర్మించాడు. బాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనీయా నఫీజ్ కీలక పాత్రల్లో నటించారు.
డిసెంబర్ 22న ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. హాలీవుడ్ సినిమాల ఫార్మాట్ లో ఈ మూవీ నిడివిని కేవలం 90 నిమిషాలకు కుదించారు.
అంతే కాకుండా నిడివి తగ్గడంతో సినిమాకు ఇంటర్వెల్ లేకుండా కంటిన్యూగా ఎండ్ వరకు ప్రదర్శించబోతున్నారు. ఇదే ఇప్పడు నయనతార సినిమాకు పెద్ద ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు 3 గంటలకు నిడివికి పైనే వుంటున్న ఈ రోజుల్లో నయన సినిమా కేవలం గంటా 30 నిమిషాలే వుండటం గమనార్హం.
ఇదే ఇప్పుడు తమిళనాట ఈ మూవీకి పెద్ద ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. నిడివి కారణంగా అసలు విరామమే లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి ఎగ్జిబిటర్లు సపాక్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. తమిళనాడులోని థియేటర్ల యజమానులు ఈ మూవీని ప్రదర్శించడానికి ముందుకు రాకపోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. తమిళనాట లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటని అంతా అవాక్కవుతున్నారు.
ప్రతీ సినిమాకు ఇంటర్వెల్ వుంటేనే థియేటర్ సిబ్బందికి ఎంతో కొంత ఆదాయం వుంటుంది. ఇంటర్వెల్ సమయంలో అమ్మే కూల్ డ్రింక్స్, చిరు తిళ్లకు ఈ సినిమా గండి కొట్టేలా వుందని పలువురు థియేర్స్ ఓనర్స్ చిత్ర బృందానికి తెలిపినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో పునరాలోచించుకుని ఇంటర్వెల్ వుండేలా ప్లాన్ చేయాలని మేకర్స్ తో చర్చిస్తున్నారట. ఇదిలా వుంటే తెలుగులో ఈ మూవీకి పెద్దగా బజ్ లేకపోయినా థియేటర్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
ఈ నేపథ్యంలో ఈ మూవీతో పాటు డిసెంబర్ 23న రవితేజ 'ధమాకా' రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయింది. ఇక విశాల్ నటించిన 'లాఠీ'కి కూడా తమిళ, తెలుగు భాషల్లో మంచి బజ్ వుంది. అలాగే హీరో నిఖిల్ తో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ వ్రైటింగ్స్ నిర్మిస్తున్న '18 పేజెస్' మూవీకి కూడా భారీ క్రేజ్ వుంది. ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతోంది. అయితే నయనతార 'కనెక్ట్' సినిమాకు థియేటర్స్ లేవు.. బజ్ అంతగా లేకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.