Begin typing your search above and press return to search.

పూజా హెగ్డేకి దిమ్మ‌తిరిగే షాక్‌?.. అతి చేస్తే అట్లుంట‌ది మ‌రి!

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:29 AM GMT
పూజా హెగ్డేకి దిమ్మ‌తిరిగే షాక్‌?.. అతి చేస్తే అట్లుంట‌ది మ‌రి!
X
టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 'ఒక లైలా కోసం' మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ పొడుగు కాళ్ల సుంద‌రి.. అన‌తి కాలంలోనే ఇక్క‌డ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఓవైపు అద్భుత‌మైన న‌ట‌న‌, మ‌రోవైపు మాయ చేయగల అందంతో ప్రేక్ష‌కుల‌ను మిస్మ‌రైస్ చేస్తూ సౌత్ తో పాటు నార్త్ లోనూ దూసుకుపోతోందీ బ్యూటీ.

చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా హెగ్డేపై గ‌త కొంత కాలం నుంచీ ఓ విమ‌ర్శ తెగ హ‌ల్ చల్ చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో తన వెంట ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే తీసుకొచ్చే పూజా హెగ్డే.. ఇప్పుడు ఏకంగా డ‌జ‌న్ మందిని వెంటబెట్టుకొని షూటింగ్ లొకేషన్‌కి వస్తోంద‌ట‌. పైగా రెమ్యూనరేషన్ కాకుండా తనతో పాటు తన స్టాఫ్‌ కి అయ్యే ఖర్చులను కూడా నిర్మాణ సంస్థ భరించాలని ముందుగానే ఆమె అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంద‌ట‌.

అయితే ఈ కార‌ణంగా నిర్మాతలపై ఆర్థికభారం అధికంగా పడుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ విష‌యంపై రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి సైతం బ‌హిరంగంగానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ బుట్ట‌బొమ్మ త‌న పద్ధతిని మార్చుకోకపోవ‌డంతో.. ఇటీవ‌ల ఓ నిర్మాణ సంస్థ ఆమెకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింద‌ట‌.

కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తితో పూజా హెగ్డే తొలిసారి జ‌త‌క‌ట్టిన చిత్రం 'బీస్ట్‌'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ మూవీ భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచింది. అయితే విజ‌య్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా వీకెండ్ వ‌ర‌కు బాగానే క‌లెక్షన్స్‌ వ‌చ్చినా.. నిర్మాత‌ల‌కు న‌ష్టాలైతే త‌ప్ప‌లేదు.

సినిమా ఫ్లాప్ కావడంతో న‌ష్టాల్లో మునిగిన నిర్మాత‌ల‌కు.. పూజ హెగ్డే మ‌రియు ఆమె స్టాఫ్‌ ఖర్చులు మ‌రింత భారంగా మారాయ‌ట‌. దాంతో నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చును తానే కట్టుకోవాలంటూ బిల్లు పేపర్లను ఆమెకు పంపి షాక్ ఇచ్చిన‌ట్లు తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ నేప‌థ్యంలోనే నెటిజ‌న్లు అతి చేస్తే అట్లుంట‌ది మ‌రి, ఇప్ప‌టినుంచైనా నీ పద్ధతి మార్చుకుంటే నిర్మాత‌లు న‌ష్ట‌పోకుండా ఉంటారంటూ పూజా హెగ్డేకు చుర‌క‌లు వేస్తున్నారు.