Begin typing your search above and press return to search.
నిర్మాత సి. కల్యాణ్ కు సుప్రీం షాక్.. ఇప్పుడేం చేస్తారు?
By: Tupaki Desk | 1 July 2021 6:30 AM GMTపేరుకు సినీ నిర్మాతే కానీ.. పలు వివాదాల్లో తరచూ వినిపించే పేరు చిల్లర కల్యాణ్.. అలియాస్ సి. కల్యాణ్. తాజాగా ఆయనకు దేశ అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. ఒక భూమి విషయంలో కల్యాణ్ తీరును తప్పు పట్టింది. నిజానికి హైదరాబాద్ లోని పలు భూములకు సంబంధించి కల్యాణ్ కు వివాదాలు ఉన్నాయి. తాజా ఉదంతంలోకి వెళితే.. కొండాపూర్ కు కాస్తంత దూరంలో ఉండే హఫీజ్ పేట లోని సర్వే నెంబరు 80కు సంబంధించిన కొంత భూమి విషయంలో వివాదం నెలకొని ఉంది.
దీనికి సంబంధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొంతకాలం నడిచింది. ఈ వివాదంలో సి.కల్యాణ్ కు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వచ్చింది. దీన్నిసవాల్ చేస్తూ కల్యాణ్ మీద న్యాయపోరాటం చేస్తున్న సాహెబ్బాదీ హమీదున్నీసా బేగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది.
ఈ వివాదానికి సంబంధించి కోర్టులో ఫైనల్ డిక్రీ పొందకుండానే భూముల్లో ఎలా నిర్మాణాలు చేపడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే.. కల్యాణ్ తరఫు వాదనలు వినిపించిన లాయర్ ఫైనల్ డిక్రీ వచ్చిందని వాదించారు. దీంతో.. హైకోర్టు తీర్పులో ఫైనల్ డిక్రీ ఇవ్వలేదన్న విషయం స్పష్టంగా ఉందని చెబుతూ సి.కల్యాణ్ కు.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న అంశాల్ని కూడా సరిగా చూడకపోవటమా? లాయర్ కు సుప్రీంకోర్టు చెప్పాల్సి రావటమా? అన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.