Begin typing your search above and press return to search.
శిల్పా శెట్టి భర్తకు మళ్లీ షాక్.. పెరిగిన కష్టాలు
By: Tupaki Desk | 26 Nov 2021 3:44 AM GMTఅశ్లీల చిత్రాలు నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనకు కష్టాలు మరింత పెరుగనున్నాయి. అశ్లీల రాకెట్ కేసులో రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ పిటీషన్ ను తాజాగా ముంబై హైకోర్టు తిరస్కరించడంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.
తన నిర్మాణ సంస్థ రూపొందించిన వీడియోలు ‘శృంగారభరితమైనవి’ మాత్రమేనని.. అవి పోర్న్ కాదని రాజ్ కుంద్రా కోర్టుకు తెలిపారు. అయితే కుంద్రా వాదనను కోర్టు అంగీకరించలేదు. దీంతో మళ్లీ అరెస్ట్ భయం ఆయనను వెంటాడుతోంది.
రాజ్ కుంద్రాతోపాటు నటి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా సహా మొత్తం ఆరుగురి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
జులై 19న రాజ్ కుంద్రాను అశ్లీల వీడియోల కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిగువ కోర్టు అతడి ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టును అతడు ఆశ్రయించాడు. ఇది ఒక వారం పాటు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత, ఇతని చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నగ్న వీడియోలు తయారు చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం వంటి అభియోగాలు రాజ్ కుంద్రాపై మోపబడ్డాయి.
గత ఏడాది ఇది ఫిబ్రవరి 4వ తేదీన మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ అధిపతి ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రా కు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సినిమాల్లో, టెలివిజన్లలో నటించేందుకు ఉత్సాహం చూపించే మోడల్స్, అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. వెబ్ సిరీస్, ఇతర షూటింగులు జరుపుతున్నట్లు నమ్మించి చివరి క్షణంలో స్క్రిప్ట్ మార్చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో షూటింగ్ చేసిన అనంతరం శృంగార వీడియోలను సోషల్ మీడియాలో ఉంచుతారు.
సదరు వీడియోలను మన దేశం లో ప్రసారం చేయడం నేరం కాబట్టి బయట దేశాల్లోని సర్వర్ల ద్వారా హాట్ షాట్ అనే యాప్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. లాక్ డౌన్లో పుణ్యమా అని సదరు యాప్ లోకి వివరాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. వీరు నుంచి చి డబ్బులు వసూలు చేసి వాటి ప్రసారాలను అందజేస్తారు. ఈ నెల 19వ తేదీన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.
మన దేశంలో ప్రసారమవుతున్న ఛానళ్లపై, సోషల్ మీడియాపై టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ట్రాయ్ గట్టి నిఘా పెడుతుంది. అశ్లీల కంటెంట్ ప్రసారం చేసినా, నిర్మించినా కఠిన నిర్ణయాలు ఉంటాయి. ఐటీ యాక్ట్ ప్రకారం జైలు అనుభవించాల్సి ఉంటుంది. రాజ్ కుంద్రాపై ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 354C, 292, 293, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మహిళలు అశ్లీల చిత్రాల్లో నటించేందుకు బలవంతంగా ప్రేరేపించడంపైనా కేసులు నమోదు చేయబడ్డాయి. ముంబై పోలీసులు రాజ్ కుంద్రాపై చార్జిషీట్ దాఖలు చేయడంతో సెప్టెంబర్ లో అతడికి బెయిల్ మంజూరైంది.