Begin typing your search above and press return to search.

ఆర్జీవీకి చివ‌రి నిమిషంలో ఝ‌ల‌క్

By:  Tupaki Desk   |   11 Dec 2019 12:30 PM GMT
ఆర్జీవీకి చివ‌రి నిమిషంలో ఝ‌ల‌క్
X
ఇంత‌కీ `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` రిలీజ‌వుతుందా అవ్వ‌దా? ఆర్జీవీకి లైన్ క్లియ‌రైన‌ట్టేనా లేదా? రేపు (డిసెంబ‌ర్ 12) రిలీజ్ అంటూ ప్ర‌క‌టించి ఇంకా ఏమిటీ సందిగ్ధ‌త‌? అభ్యంత‌రం చెప్పిన టైటిల్ ని మార్చారు. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు కాస్తా టైటిల్ మార్పుతో పోస్ట‌ర్ వేశారు. ఇక సెన్సార్ అభ్యంత‌రాలు ప‌రిశీలించేందుకు ఆర్జీవీ ఇప్ప‌టికే రివైజింగ్ క‌మిటీ ముందుకు వెళ్లారు. అయినా ఇంకా ఏంటి ఈ సందిగ్ధ‌త‌? అస‌లు రిలీజ్ ముంగిట ఏమిటి ఈ డైల‌మా?

ఇలాంటి య‌క్ష ప్ర‌శ్న‌ల‌న్నిటికీ ఇదిగో ఇదే స‌మాధానం. రామ్ గోపాల్ వర్మ చిత్రం విడుదలకు హైకోర్టు మరోసారి క్లియ‌ర్ క‌ట్ గా బ్రేక్ వేసింది. ఈ సినిమా ఈ గురువారం రిలీజ్ అయ్యే అవ‌కాశ‌మే లేదని తెలుస్తోంది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పిటీషన్ ని విచారించిన హైకోర్టు లో ఇంకా బాల్ రివైజింగ్ క‌మిటీ.. సెన్సార్ బృందం చేతిలోనే ఉంద‌ని వ్యాఖ్యానించింది.

ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్లు తాత్సారం చేశార‌ని చిత్ర యూనిట్ స్వ‌యంగా కోర్టుకు విన్న‌వించింది. అయితే ఈ పిటీషన్ పై సెన్సార్ బోర్డు..చిత్ర యూనిట్ సభ్యుల మ‌ధ్య వాగ్వాదం న‌డుస్తోంది. చిత్రంలో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేసామని చిత్ర‌యూనిట్ కోర్టుకు చెబుతున్నా.. వాళ్లు చెబుతున్న‌ట్టు ఏదీ తీసి వేసినట్టు ఎక్కడా లేదని కేవలం మ్యుట్ లో ఉంచారని సెన్సార్ బృందం వ్యాఖ్యానించింది. అయితే దీనికి కౌంట‌ర్ వాద‌న వినిపిస్తూ... అలా ఏదీ మ్యూట్ లో ఉంచలేదని కొన్ని సన్నివేశాలను డిలీట్ చేసేసామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. బోర్డు సూచనల మేరకు ఛానెల్స్ యొక్క లోగోలను తొలగించిన‌ట్టు కోర్ట్ కు తెలిపారు.

ఎగ్జామినేషన్ కమిటీ ఓమారు చిత్రాన్ని వీక్షించింది. మత పరమైన అంశాలతో పాటు ఒక వర్గాన్ని కించపరిచే లా ఉందని.. శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉండ‌డం వ‌ల్ల‌ అప్రూవ‌ల్ ఇవ్వ‌లేమని కౌంటర్ వేయ‌డం వ‌గైరా ఎపిసోడ్స్ పూర్త‌య్యాయి. దీంతో మళ్ళీ చిత్ర‌యూనిట్ రివ్యూ కి ఇచ్చింది. అంతేకాదు.. రివ్యూ కమిటీ ఇప్పటికే ఆర్జీవీ యూనిట్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింద‌ని అడిషనల్ సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. రివ్యూ కమిటీ రెండో సారి కూడా చిత్రాన్ని పరీశీలించాల్సి ఉంద‌ని .. రీవ్యూ కమిటీ చిత్రాన్ని చూసి నిర్ణయం తెలపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. రివ్యూ కమిటీ పరిధిలో ఉందని ఇప్పుడు తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అన్ని సక్రమంగా ఉన్నట్లయితేనే రిలీజ్‌ ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటి కి హైకోర్టు ఆదేశించింది.