Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ్యూస‌ర్ కు షాక్‌.. ప‌వ‌న్ మ‌ళ్లీ బ్రేకిచ్చాడు

By:  Tupaki Desk   |   5 April 2022 3:30 PM GMT
స్టార్ ప్రొడ్యూస‌ర్ కు షాక్‌.. ప‌వ‌న్ మ‌ళ్లీ బ్రేకిచ్చాడు
X
స్టార్ హీరోల‌తో సినిమా అంటే ఈ రోజుల్లో బిగ్ రిస్క్ అనేది ప్ర‌తీ ఒక్క‌రూ చెబుతున్న మాట‌. సాఫీగా సాగితే ఓకే ఒక్క‌సారి బ్రేక్ ప‌డిందా?.. నిర్మాత చుక్క‌లు చూడాల్సిందే. లేట్ అవుతున్నా కొద్దీ ప్రొడ్యూస‌ర్ కి వ‌డ్డీలు త‌డిసిమోపెడు అవుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. వెన‌క్కి వెళ్ల‌డానికి లేదు.. అలా అని హీరో లేకుండా ముందుకు వెళ్లడానికీ లేదు. దీంతో నిర్మాత ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారిపోతుంది. ప్ర‌స్తుతం ఇదే త‌ర‌హా ప‌రిస్థితిని స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం ఎదుర్కొంటున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఒక ద‌శ‌లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుని క్రేజీ ప్రొడ్యూస‌ర్ గా ఓ వెలుగు వెలిగిన ఆయ‌న ప్ర‌స్తుతం స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పీరియ‌డిక‌ల్ మూవీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందు కోసం భారీ బ‌డ్జెట్ ని కూడా కేటాయించారాయ‌న‌. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోవిడ్ కి ముందు మొద‌లైంది. కానీ ఇప్ప‌టికీ మిగ‌తా చిత్రాలు పూర్త‌యి రిలీజ్ అయి పాత‌బ‌డిపోయినా ఈ మూవీ షూటింగ్ కి మాత్రం మోక్షం ల‌భించ‌డం లేదు.

గ‌తంలో 15 రోజులు షూటింగ్ చేశారు. ఆ త‌రువాత క‌రోనా స్టార్ట్ కావ‌డంతో అన్ని సినిమాల త‌ర‌హాలోనే షూటింగ్ ఆగిపోయింది. ఏప్రిల్ 5 నుంచి తాజా షెడ్యూల్ ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం దాదాపు 5 నెల‌లు ప‌వ‌న్ కేటాయిస్తున్నార‌ని వార్త‌లు కూడా వినిపించాయి. దీంతో ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి నేతృత్వంలో మ‌రో సారి కొత్త‌గా సెట్ ల‌ని నిర్మించారు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ సెట్ లోకి రాక‌పోవ‌డంతో మంగ‌ళ‌వారం షూటింగ్ కాస్తా మ‌రోసారి పోస్ట్ పోన్ అయింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ప్ర‌స్తుతం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' ప్రాజెక్ట్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మంగ‌ళ వారం పోస్ట్ పోన్ అయిన షూటింగ్ మ‌ళ్లీ మొద‌ల‌వుతుందా? లేక మ‌ళ్లీ బ్రేకిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీతో మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఈ భారీ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు ఎ.ఎం.ర‌త్నం. కానీ వ‌రుస బ్రేక్ లు ప‌డుతుండటంతో ఆయ‌న క‌ల నెర‌వేరేదెప్పుడ‌ని ఓ చ‌ర్చ న‌డుస్తోందిట‌.

నిర్మాత ప‌రిస్థితి ఇలా వుంటే ద‌ర్శ‌కుడు క్రిష్ గురించి కూడా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చే న‌డుస్తోంది. గ‌త కొంత కాలంగా ఈ మూవీ కోసం పూర్తి స‌మ‌యాన్ని కేటాయించిన క్రిష్ దీంతో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తాని చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డంతో క్రిష్ ప‌రిస్థితి ఏంటి? అని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నార‌ట‌.

ఇవ‌న్నీ తెలిసి ద‌ర్శ‌కుడు ఏమీ చేయ‌లేక మౌనం పాటిస్తున్నార‌ని అంటున్నారు. ఈ నెల నుంచి అయినా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' ప‌ట్టాలెక్కాల‌ని ప‌వ‌న్ అభిమానులు కోరుకుంటున్నారు.