Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ ఆస్తులు గురించి తెలిస్తే షాక్ అవుతారు !

By:  Tupaki Desk   |   9 Nov 2021 12:30 AM GMT
కమల్ హాసన్ ఆస్తులు గురించి తెలిస్తే షాక్ అవుతారు !
X
కమల్ హాసన్ ..లోకనాయకుడు . నటనలో తనకి తిరుగులేదని నిరుపించుకున్న మహా గొప్ప నటుడు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్న గొప్ప వ్యక్తి. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు అంటూ అతిశయోక్తి లేదు. ఆయన పొందని ప్రశంస లేదు. నటనలో పీక్స్ చూశాడు. ఉప్పొంగే అద్భుత హావభావాల నటప్రవాహం. అంత తేలిగ్గా అంతుపట్టని మర్మయోగి. ఎంత అభివర్ణించినా పట్టుబడని ప్రజ్ఞాశాలి. అనుకున్నది సాధించి ఎవ్వరూ ఛేదించలేని శిఖరంలా ఎదిగాడు. అతి సామాన్యుడిలా ఒదిగాడు. ఆరేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించాడు.

1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. 1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారీ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన పదనారు వయదినిలె కమల్ హాసన్ కెరీర్‌‌ ను మలుపుతిప్పింది. 1978లో మరో చరిత్రతో కమల్‌ చరిత్రే మారిపోయింది. హీరోయిజానికి మించి నటుడిగా తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్లింది. నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడేవాడు.

కమల్‌ హాసన్‌ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులతో పాటు 4 నేషనల్‌ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్‌ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు. కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌ లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. త్వరలో విక్రమ్ తో పాటు భారతీయుడు 2 చిత్రాలతో త్వరలోప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక తనకు మొత్తం రూ.176.93 కోట్ల ఆస్తులున్నట్టు కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో నామినేషన్స్ లో పొందుపరిచారు. అందులో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు, కాగా చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. ఇక లండన్‌ లో రూ.2.50 విలువ చేసే ఇల్లు.. రూ.2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు కమల్ హాసన్ తెలిపారు. అంతేకాదు తనకు రూ.49.5 కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. 2018 ఫిబ్రవరిలో కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినా కమల్ పార్టీ పెద్దగా ప్రభావం చిపించలేకపోయింది.