Begin typing your search above and press return to search.
మహర్షికి అక్కడ బ్రేకులు
By: Tupaki Desk | 7 May 2019 4:43 AM GMTఇంకో రెండు రోజుల్లో మహర్షి సందడి మొదలు కాబోతోంది. మహేష్ బాబు పాతికవ సినిమాగా ల్యాండ్ మార్క్ గా నిలవాలని కోరుకొని అభిమాని లేడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే భారీ విడుదలకు రంగం సిద్ధమైపోయింది. రోజులు గంటల్లోకి వచ్చేయడంతో కౌంట్ డౌన్ తో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సమాంతరంగా రిలీజ్ ని ప్లాన్ చేసుకున్న మహర్షికి అక్కడ కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి.
ప్రముఖ థియేటర్ చైన్ గా గుర్తింపు ఉన్న వెట్రి సినిమా యాజమాన్యం మహర్షిని వేసేందుకు సుముఖంగా లేదట. బయ్యర్ కు తమకు మధ్య షేరింగ్ పెర్సెన్టేజ్ గురించి అండర్ స్టాండింగ్ కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇదే బాటలో మరో సంస్థ జికే సినిమాస్ కూడా ఉన్నట్టు టాక్ ఒకవేళ రేపటికంతా ఈ సమస్య పరిష్కారం కాకపోతే వెట్రి ధియేటర్ చైన్ లో ఎక్కడా మహర్షి రాకపోవచ్చు.
యుద్ధ ప్రాతిపదికన దీన్ని పరిష్కరించేందుకు బయ్యర్ల తరఫున కొందరు చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి అడ్వాన్సు బుకింగ్ ఈ స్క్రీన్లకు సంబంధించి ఇంకా పెట్టలేదు. ఇదే జరిగితే వసూళ్ళ మీద ప్రభావం ఉంటుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. పోటీ లేని తరుణంలో మహేష్ కు తమిళనాడులో మార్కెట్ పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశమని చెబుతున్నారు. సో మహర్షికి రేపటి లోగా ఈ అడ్డంకి తొలగిపోతే మరింత మెరుగ్గా ఓపెనింగ్ ఫిగర్స్ నమోదయ్యే అవకాశం ఉంది