Begin typing your search above and press return to search.
షాకింగ్: 18 వెబ్ సైట్ లపై బ్రహ్మాస్త్రం
By: Tupaki Desk | 6 Sep 2022 5:32 AM GMTరణబీర్ కపూర్- అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంది.
నిజానికి దర్శక నిర్మాతలు నటీనటులు ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు స్టార్ ఇండియా ఒక అడుగు ముందుకు వేసి సినిమా విడుదలకు ముందు చట్టవిరుద్ధంగా ప్రసారం చేయకుండా 18 వెబ్ సైట్ లను నియంత్రించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
దీనికి కోర్టు తీర్పు అనుకూలించింది. భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రా చిత్రాన్ని చట్టవిరుద్ధంగా ప్రసారం చేయకుండా ఢిల్లీ హైకోర్టు 18 వెబ్ సైట్ లను నిషేధించింది. తాజా కథనాల ప్రకారం.. స్టార్ ఇండియా కాపీరైట్ ఉల్లంఘనపై దావా వేసింది.
మొదట థియేటర్లలో విడుదల చేసి తర్వాత సినిమాలను వేర్వేరు ప్లాట్ ఫారమ్ లకు అందుబాటులో ఉంచడం పరిశ్రమ పద్ధతి అని పేర్కొంది. ఇంకా సినిమా థియేట్రికల్ విడుదల అత్యంత క్లిష్టమైన దశ అని కంపెనీ తన దావాలో పేర్కొంది. ఎందుకంటే సినిమా వాణిజ్య విలువ దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ వ్యాజ్యాన్ని అనుసరించి ఈ మూవీ అక్రమ ప్రసారాన్ని నియంత్రించే పోకిరీ వెబ్ సైట్ లపై ఢిల్లీ హైకోర్టు కదిలి వచ్చింది. వాస్తవానికి ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఈ సైట్ లను బ్లాక్ చేయమని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరుతూ నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
ఈ చిత్రం విషయానికొస్తే... 'బ్రహ్మాస్త్ర' అనేది ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్. ఈ మూవీలో VFX భారీతనంతో ఆకట్టుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ భాషలలో ప్రామాణిక 3D .. IMAX 3D ... 4DX 3D ఫార్మాట్ లలో విడుదల కానుంది. రణబీర్ కపూర్ - అలియా భట్ లతో పాటు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- నాగార్జున అక్కినేని- మౌని రాయ్ - షారూఖ్ ఖాన్- దీపికా పదుకొనే అతిధి పాత్రలు పోషించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.