Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై జ‌క్క‌న్న షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   16 March 2022 2:30 PM GMT
చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై జ‌క్క‌న్న షాకింగ్ కామెంట్స్‌
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌' ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌ల‌వుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇద్ద‌రు స్టార్ హీరోలు దాదాపు మూడున్న‌రేళ్లు ప‌డిన క‌ష్టానికి ప్ర‌తి రూపం ఈ మూవీ. అంతే కాకుండా 'బాహుబ‌లి' త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న క్రేజీ మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఇద్ద‌రు రియ‌ల్ హీరోస్ ఫిక్ష‌న‌ల్ స్టోరీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీకి య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌ని జోడించి రాజ‌మౌళి త‌న‌దైన స్టైల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రిలీజ్ కు మ‌రి కొన్ని రోజుల‌లే వుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌చాన్ని జోరుగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డిస్తున్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా వివిధ కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ అడ్వాన్స్ బుకింగ్స్ ల కార‌ణంగా రికార్డులు సృష్టిస్తూ వ‌ర‌ల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేప‌థ్యంలో తాజా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై షాకింగ్ కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

సినిమా ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుంద‌ని, త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని చెప్పిన రాజ‌మౌళి.. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి మాస్ హీరోస్ తో సినిమా అంటే అంచ‌నాలు భారీ రేంజ్ లో వుంటాయ‌ని, ఆ అంచ‌నాలని అందుకునే స్థాయిలో సినిమా వుంటుంద‌ని చెప్పుకొచ్చారు. 'RRR' లో ఇద్ద‌రు హీరోలున్నా ప్ర‌ధానంగా క‌థే హీరో. ఒక‌రు త‌క్కువ‌.. ఒక‌రు ఎక్కువ అనే స‌మ‌స్య లేదు. అది సినిమా చూస్తున్న ప్రేక్ష‌కులు మ‌ర్చిపోతారు. అంత‌గా క‌థ‌లో లీన‌మౌతార‌ని తెలిపారు.

అంతే కాకుండా హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ లు, ఫైట్స్, పంచ్ డైలాగ్ లు పెడితే క‌థ దెబ్బ‌తింటుంద‌ని, అందుకే క‌థానుగుణంగానే సినిమా చేశాను కానీ హీరోల‌ని బ‌ట్టి సినిమా చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 'RRR' కొమ‌రం భీం, అల్లూరి సీతారామ‌రాజుల జీవిత క‌థ ఆధారంగా చేసిన సినిమా కాదు. వారి పాత్ర‌ల స్ఫూర్తితో రాసుకున్న క‌ల్పిత క‌థ ఇది. ఇద్ద‌రి పాత్ర‌లు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పాత్ర‌లే కావ‌డంతో వారి ఔన్న‌త్యాన్ని, పాత్ర‌ల ఔచిత్యాన్ని ఎక్క‌డా దెబ్బ‌తీయ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాన‌న్నారు.

నేను అనుకున్న క‌థ‌ని విజువ‌లైజ్ చేయ‌డానికే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింద‌ని చెప్పిన రాజ‌మౌళి 'RRR' .. బాహుబ‌లిని మించి హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. అలియా భ‌ట్ ని సీత పాత్ర కోసం ఎంపిక చేసుకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టారు. ఆమెని గ్లామ‌ర్ తార కాబ‌ట్టే తీసుకోలేద‌ని, ఆమెలోని అమాయ‌క‌త్వ‌పు చూపుల‌ని గ‌మ‌నించాను కాబ‌ట్టే అలియా భ‌ట్ ని సీత పాత్ర కోసం తీసుకున్నా న‌న్నారు. అంతే కాకుండా ప్ర‌తీ లాక్ డౌన్ త‌రువాత సెట్స్ కి వెళ్లిన ప్ర‌తీసారి నా ఆలోచ‌న‌లు మారిపోతుండేవ‌ని, ఆ ఆలోచ‌న‌ల కార‌ణంగానే సినిమాను త్రీడీ, ఐమాక్స్ , డాల్బీ వంటి స‌రికొత్త ఫార్మాట్ ల‌లో రిలీజ్ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు రాజ‌మౌళి.

ప్రేక్ష‌కులు ప్ర‌తీ ఫార్మాట్ ని ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం వుందని తెలిపారు. ఏపీ ప్ర‌భుత్వానికి, టాలీవుడ్ కి మ‌ధ్య ఏర్ప‌డిన ప్ర‌తిష్టంభ‌న గురించి మాట్లాడుతూ 'స‌రైన క‌మ్యూనికేష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇండ‌స్ట్రీకి చిక్కులు ఎదుర‌య్యాయని, 'RRR' కోసం గౌర‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారిని క‌లిశామని, ప్రేక్ష‌కుల‌కు భారం కాకుండా.. మీరూ న‌ష్ట‌పోకుండా చేద్దాం అన్నార‌ని, ఆయ‌న మాట‌తో మాకు భ‌రోసా ల‌భించింద‌ని చెప్పుకొచ్చారు.