Begin typing your search above and press return to search.
మారని ఎన్టీఆర్ లుక్ .. షాక్ అవుతున్న ఫ్యాన్స్!
By: Tupaki Desk | 8 Oct 2021 12:30 AM GMTఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీరి అభిమానులు ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆత్రుతతో .. ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దాంతో షూటింగు పార్టు పూర్తయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఇంకా కొమరం భీమ్ లుక్ తోయినే ఉండటం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇటీవల తూర్పు గోదావరి జిల్లా 'రాజోలు' గ్రామానికి చెందిన కొప్పాడి మురళి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదం కారణంగా హాస్పిటల్ పాలయ్యాడు. కొన్ని రోజులుగా ఆయనకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది. అయితే ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడం వలన కోలుకునే అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మనసులోని బలమైన కోరిక ఏదో తెలుసుకుని నెరవేర్చడానికి వైద్యులు ప్రయత్నించారు. దాంతో తాను ఎన్టీఆర్ అభిమానిననీ .. ఆయనతో మాట్లాడాలని ఉందని మురళి చెప్పాడట. వెంటనే వైద్యులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
తన అభిమాని చివరి కోరిక గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే వీడియో కాల్ చేసి, అతనితో మాట్లాడాడు. త్వరలోనే కోలుకుంటావంటూ ఆయనకి మనోధైర్యాన్ని చెప్పాడు. అయితే ఎన్టీఆర్ ఆ వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతుండగా, హాస్పిటల్లో ఎవరో వీడియో తీశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ఇంకా కొమరం భీమ్ లుక్ తోనే కనిపిస్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు జరుగుతూనే ఉందా? ఇంకా పూర్తికాలేదా? అనే చర్చలు జోరందుకుంటున్నాయి.
అయితే రాజమౌళి తన సినిమాల చిత్రీకరణకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడనే విషయం తెలిసిందే. కథాకథనాలను రెడీ చేసుకోవడానికీ .. గ్రాఫిక్స్ వర్క్ ను దృష్టిలో పెట్టుకుని షాట్స్ రెడీ చేసుకోవడానికి ఆయన చాలా సమయం తీసుకుంటాడు. ఇక ఒక్కోసారి అవసరమైతే రీ షూట్ల కోసం కూడా వెళుతుంటాడు. ఆయన ప్రతి సీన్ ను చెక్కుతాడనీ .. అందుకే ఆయనను తాను 'జక్కన్న' అని పిలుస్తుంటానని ఒక సందర్భంలో ఎన్టీఆర్ అన్నాడు. ఇప్పుడు కూడా అలాంటి వర్క్ ఏదో జరుగుతూ ఉండొచ్చు. ఇక ఈ సినిమా తరువాత కొరటాల ప్రాజెక్టు పైకి ఎన్టీఆర్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.
కొరటాల సినిమా అనగానే బలమైన కథాకథనాలు .. ఆ రెండింటి మధ్య బలంగా అల్లుకున్న సందేశం కనిపిస్తుంది. ఇంతవరకూ ఆయన తన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ వచ్చాడు. 'ఆచార్య' కూడా సందేశాన్ని ఇస్తూనే నడుస్తుంది. అలాగే ఎన్టీఆర్ చేయనున్న సినిమా కూడా వినోదం పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా నడుస్తుందట. ఇంతకుముందు ఈ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత వస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తుండటం విశేషం.