Begin typing your search above and press return to search.
షాకింగ్: CHIRU 152 లో నక్సలైట్?
By: Tupaki Desk | 10 Feb 2020 6:40 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దాదాపు 40 నిమిషాల నిడివితో ఉండే ఆ పాత్ర ఆద్యంతం రక్తి కట్టిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో కథానాలు వేడెక్కిస్తున్నాయి. సిద్ధు (చరణ్) అనే పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని కొరటాల ప్రత్యేకంగా తీర్చిదిద్దారని ప్రచారం సాగుతోంది. అసలు చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటూ మెగాభిమానుల్లో ఒకటే ఆసక్తి నెలకొంది. తాజాగా చరణ్ పాత్రకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం లీకైంది. ఒక రకంగా చెర్రీ రోల్ షాకిచ్చేదేనని తెలుస్తోంది.
చరణ్ ఇందులో నక్సలైట్ గా కనిపిస్తాడట. ఆంధ్రాలోని దట్టమైన అడవుల్లో తిరిగే కామ్రేడ్ గా ఆద్యంతం ఎమోషన్ ని రగిలించే పాత్రలో నటిస్తారని గుసగుస వినిపిస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు అడవుల్లోనే అతడి రోల్ రన్ అవుతుంది. అలాగే ఈ సినిమా కోసం చరణ్ మొత్తం 30 రోజుల కాల్షీట్లు ఇస్తానని అంగీకరించారట. ఏప్రిల్ నుంచి చిరు 152 (ఆచార్య) షూట్ లో చరణ్ పాల్గొంటారని సమాచారం. దేవాదాయ శాఖ భూముల కుంభకోణం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ ఇదని ఇప్పటికే లీకులు అందాయి. ఇందులో చిరు ఎండోమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తారు.పేరుకు ఆఫీసర్ అయినా...పాత్ర మాత్రం మాసీగానే ఉంటుందట.
దేవాదాశ శాఖలో జరిగే అవినీతిని కడిగేసే నిజాయితీగల ఆఫీసర్ రోల్ ఎమోషనల్ గా ఉంటుందట. తాజాగా చరణ్ రోల్ ను బట్టి ఈ రెండు పాత్రల కనెక్టివిటీ ని అర్థం చేసుకోవచ్చు. చిరుకి యంగర్ వెర్షన్ పాత్ర కాబట్టి యువ ఆఫీసర్ గా కనిపిస్తాడని భావించినా అతడిలోని నక్సలైట్ షేడ్ ఆసక్తిని పెంచుతోంది. చరణ్ పాత్ర ఏ మాత్రం నెగిటివ్ గా కనిపించే అవకాశం లేదని అర్థమవుతోంది. నక్సలైట్ ఉద్యమం అనేది సమసమాజ స్థాపన కోసం ఏర్పాటైంది. 80లలో కామ్రేడ్ లు సిద్ధాంతానికి కట్టుబడి పని చేసేవారని చరిత్ర చెబుతోంది. మరి చరణ్ నాటి కామ్రేడ్ తరహానా.. లేక నేటి నక్సలైట్ తరహానా? అన్నది తెరపైనే చూడాలి.