Begin typing your search above and press return to search.
షాకింగ్ః వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లేనట్టేనా..?
By: Tupaki Desk | 25 March 2021 6:30 AM GMTదాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో.. తమ హీరో సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే.. సినిమా ప్రమోషన్ మాత్రం పవన్ రేంజ్ కు తగినట్టుగా సాగట్లేదనేది ఫ్యాన్స్ కంప్లైంట్. అప్పుడప్పుడూ థమన్ ఇచ్చిన అప్డేట్లు, ఓ టీజర్ తప్ప, పెద్దగా ప్రచారం జరగట్లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో.. నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశారనే వార్తలు వెలువడ్డాయి.
దాదాపు కోటి రూపాయల వ్యవయంతో ఈ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నారని, ఏప్రిల్ 3వ తేదీన ఈవెంట్ ఉండొచ్చనే ప్రచారం సాగింది. అంతేకాదు.. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గెస్టులుగా రాబోతున్నారని కూడా తెలిసింది. కానీ.. ఈ విషయం గురించిన డిస్కషన్ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు.
దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలను కూడా మూసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్నది ప్రశ్న.
పవన్ రీ-ఎంట్రీలో నిర్వహిస్తున్న మొదటి సినిమా ఈవెంట్ కాబట్టి.. అభిమానులు లక్షల్లో వస్తారనే అంచనాలు ఉన్నాయి. కొవిడ్ నిబంధనల మధ్య వారిని కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యమనే విషయంలో నిర్మాతతోపాటు సినిమా యూనిట్ కూడా మల్లగుల్లాలు పడుతోందట. కేవలం పాసులు ఇచ్చి వారిని అనుమతించాలని చూసినా.. ఫ్యాన్స్ కుర్చీలకే పరిమితం అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు.
మరి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారా? లేదా? అన్న విషయం తెలియట్లేదు. కాగా.. ఈ మూవీ టీజర్ ఈ నెల 29న రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు సైతం తనవంతు ప్రమోషన్లో పాల్గొంటున్నారు. మరి, ఈవెంట్ సంగతి ఏంటన్నది చూడాలి.