Begin typing your search above and press return to search.
ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్
By: Tupaki Desk | 16 May 2022 1:56 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ 3డి చిత్రీకరణను పూర్తి చేసిన ప్రభాస్ తదుపరి సలార్ రెగ్యులర్ షూట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మధ్యలోనే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ షెడ్యూల్స్ ని డ్రాగ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే కేజీఎఫ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న సలార్ ఎప్పుడు రిలీజవుతుందో తెలియాలంటే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ఒక రేంజులో సతాయించడం సోషల్ మీడియాల్లో సంచలనంగా మారుతోంది. రిలీజ్ తేదీని మరోసారి ప్రకటించాలని లేదా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. నిజానికి ఇలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.
సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ చాలా కాలం క్రితమే ప్రారంభించినా కానీ ఇప్పటికి కేవలం 30-35 శాతం షూట్ మాత్రమే పూర్తయింది. అంటే దాదాపు 70శాతం చిత్రీకరణ ఇంకా జరగాల్సి ఉంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే మొత్తం చిత్రీకరణను అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభాస్- ప్రశాంత్ నీల్ బృందం కసిగా పని చేస్తున్నారు. 2023 వేసవి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు నిర్మాత లు వెల్లడిస్తున్నారు.
డార్లింగ్ కి లీకుల బెడదప్రభాస్ 'సలార్ సెట్స్ నుండి తీసిన ఫోటో ఒకటి శనివారం సోషల్ మీడియాలో లీక్ అయింది. పాన్ ఇండియా యాక్షన్ చిత్రం లో ప్రభాస్ లుక్ ఎలా ఉండనుంది? అన్నదానికి ఇది హింట్ గా మారింది. అయితే లీక్డ్ ఫోటో డార్లింగ్ అభిమానులలో చాలా ఉత్సాహం పెంచింది. మూవీ షాట్ మధ్య క్లిక్ చేసిన ఫోటో ఇది. ప్రభాస్ పక్కా మాస్ అవతార్ లో కనిపిస్తారని ఈ ఫోటో లీక్ అందించింది. ప్రభాస్ లుక్ ను మేకర్స్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేసారని ఈ ఫోటో రివీల్ చేసింది. అయితే ఇలాంటి లీకుల వల్ల క్యూరియాసిటీ తగ్గిపోతే అది ఇబ్బందికరం. అందుకే అలాంటి లీక్‌లను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని టీమ్ చెబుతోంది.
కానీ ఇలాంటి లీకేజీల ఇబ్బందులు టీమ్ ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు మాట్లాడుకునేలా లీక్ అయింది అంటే ఇది అంత మంచిది కాదు. చాలా మంది నెటిజన్లు లీకైన చిత్రంలో ప్రభాస్ లుక్ ను అభినందిస్తున్నా కానీ ఇలా ముందే లీక్ కావడం సరికాదని విశ్లేషిస్తున్నారు. అసలే ప్రభాస్ అభిమానులు సాలార్ కోసం ఊపిరాడని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2- సాహో తర్వాత మళ్లీ ప్రభాస్ ని భారీ యాక్షన్ చిత్రంలో చూడాలన్నది అభిమానుల కల. కేజీఎఫ్ 2 తో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ ఆ కలను నెరవేరుస్తాడని సలార్ ని మరో లెవల్లో తీరుస్తాడని ఆశిస్తున్నారు.
సలార్ - కేజీఎఫ్ పాత్రలను కలిపి భారీ ప్రయోగం?కేజీఎఫ్ 2 సంచలన విజయం సాధించిన నేపథ్యంలో సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ మరోసారి ఇండియా లెవల్లో సంచలనాలకు తెర తీసే ప్రయత్నంలో ఉన్నారని అతడి మైండ్ పాదరసంలా షార్ప్ గా పని చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే సాహో స్టార్ కేజీఎఫ్ స్టార్ లను కలుపుతూ ఒక యూనిక్ యూనివర్శ్ నే క్రియేట్ చేయాలని ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్నారట.KGF ఫ్రాంచైజీ -సలార్ మధ్య క్రాస్ఓ వర్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సలార్ పూర్తి చేసిన తర్వాత KGF 3 పనులను ప్రారంభిస్తామని KGF నిర్మాత విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. నిర్మాత ప్రసంగంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఒకటి ఉంది. KGFతో మార్వెల్-ఎస్క్యూ ఫిల్మ్ ఫ్రాంచైజీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలకు దారితీసింది. మార్వెల్ లాంటి ఫ్రాంచైజీని ప్లాన్ చేస్తున్నామని నిర్మాత చెప్పారంటే.. కచ్ఛితంగా సలార్ -కెజిఎఫ్ మధ్య క్రాస్ ఓవర్ పాత్రల సృజనను ప్లాన్ చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. నిజానికి ప్రభాస్ - యష్ లను కలుపుతూ ఇండియా లెవల్లో సంచలనాలు సృష్టించేందుకు ఆస్కారం ఉన్న ఆలోచన ఇది. యూనివర్శ్ క్రియేట్ చేసి ఇందులో ఆ ఇద్దరితో పాటు ఆర్.ఆర్.ఆర్ స్టార్లను కూడా మెర్జ్ చేస్తే అది మరింత సంచలనంగా మారుతుందేమో?