Begin typing your search above and press return to search.
దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ కి షాకింగ్ ఆఫర్!
By: Tupaki Desk | 12 July 2022 12:30 PM GMTకరోనా తరువాత టాలీవుడ్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ మార్పులు జరుగుతూనే వున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం మునుపటికి కన్నా భారీ స్థాయిలో పెరిగింది. క్రేజీ సినిమాలకు మార్కెట్ స్థాయి కూడా భారీగానే పెరుగుతూ వస్తోంది. ఓటీటీ బిజినెస్ ఊపందుకుంది. గతంతో పోలిస్తే సినిమా మేకర్లకు ఆదాయవనరులు పెరిగాయి. ఓటీటీల ద్వారా, శాటిలైట్ రైట్స్, హిందీ రైట్స్ ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగింది. దీంతో ప్రతీ ఒక్కరు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. భారీగా క్యాష్ చేసుకుంటున్నారు.
అయితే ఇంతగా మారినా ఒక్క విషయంలో మాత్రం టాలీవుడ్ ని ఓ భయం వెంటాడుతోంది. అదే థియేట్రికల్ రన్ అండ్ బిజినెస్. భారీ చిత్రాలకు తప్ప చిన్న సాదాసీదా.. టైర్ టు హీరోల సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కరువవుతోంది.
పెద్దగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. దీంతో థియేట్రికల్ ఆదాయం తగ్గుతూ వస్తోంది. కానీ నాన్ థియేట్రికల్ ఆధాయం మాత్రం పెరుగుతూ పోతోంది. థియేట్రికల్ బిజినెస్ తగ్గుతోందని బాధపడుతున్న మేకర్స్ కి నాన్ థియేట్రికల్ ఆధాయం ఊరటకలిగిస్తోంది.
కానీ ఇది రానున్న రోజుల్లో థియేటర్ల వ్యవస్థని పతనం చేయడం ఖాయమని, దీంతో సినిమా ఇండస్ట్రీ మనుగడ ఎలా అని కొంత మంది ప్రొడ్యూసర్లు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే నేచురల్ స్టార్ నాని సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ కి షాకింగ్ ఆఫర్ లభించినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు డిజిటల్, హిందీ, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్నీ కలిపి 47 కోట్ల మేరకు రికార్డు స్తాయి మొత్తంలో ఆఫర్లు దక్కినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మేరకు సదరు సంస్థలతో ఒప్పందం కుదిరినట్టుగా తెలిసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నారు. 50 కోట్ల లోపే ఈ మూవీ బడ్జెట్ అని తెలుస్తోంది. అదే నిజమైతే ప్రొడ్యూసర్ కి నో టెన్షన్ అన్నమాట. సినిమా కోసం ఇప్పటికే సింగరేణి కాలరీస్ కు సంబంధించిన కాలనీ సెట్ ని భారీ ఖర్చుతో వేశారు. అక్కడే పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు.
అదీ కాకుండా 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనగా కీర్తి సురేష్, నానిలపై ఓ పాటని భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారట. ఈ పాట కోసమే ఏకంగా 2 కోట్లు ఖర్చు చేస్తుండటం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఓ భారీ సెట్ కోసం కూడా కోటి ఖర్చు చేశారట. థియేట్రికల్ గా ఈ మూవీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ మేకర్స్ మాత్రం భారీగా ఖర్చు చేస్తుండటంతో థీయేట్రికల్ రన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ బడ్జెట్ ని అదుపు చేస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయట.