Begin typing your search above and press return to search.
షాకిస్తున్న'రాధేశ్యామ్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
By: Tupaki Desk | 10 March 2022 10:51 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ విజువల్ వండర్ `రాధేశ్యామ్` ఈ శుక్రవారం భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? అని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, సాహో వంటి చిత్రాల తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇది.
రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కొత్త పంథాలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కావడంతో ఈ మూవీ కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత కొంత కాలంగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 11న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని సరికొత్త లొకేషన్ లలో ఓ హెరిటేజ్ లవ్ స్టోరీగా ఈ మూవీని నిర్మించారు.
రిలీజ్ కు ముందే థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు థియేట్రికల్ బిజినెస్ పరంగా ఈ మూవీ 200 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ పరంగా కూడా `రాధేశ్యామ్` సంచలనం సృష్టిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
అయితే ఇతర భాషల్లో మాత్రం ఆ క్రేజ్ కనిపించడం లేదని చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాదితో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆ స్పీడు కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే థియేట్రికల్ రైట్స్ పరంగా `బాహుబలి -2` తరువాత హయ్యెస్ట్ అమౌంట్ ని సొంతం చేసుకున్న మూడవ సినిమాగా `రాధేశ్యామ్` రికార్డుని సొంతం చేసుకోవడం విశేషంగా చెబుతున్నారు.
అయితే ఈ లిస్ట్ లో మూడుకి మూడు చిత్రాలు ప్రభాస్ వే వుండటం గమనార్హం. బాహుబలి ది కన్ క్లూజన్, సాహో చిత్రాల తరువాత ఆ ఘనతని సాధించిన చిత్రంగా `రాధేశ్యామ్` నిలిచింది, రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా వున్నాయి.
నైజాం : 40 కోట్లు అడ్వాన్స్
ఆంధ్రా : 50 కోట్ల రేషియో
సీడెడ్ : 15 కోట్ల అడ్వాన్స్
ఏపీ అండ్ తెలంగాణ మొత్తం : 115 కోట్లు
కర్ణాటక : 15 కోట్లు ఎన్ ఆర్ ఏ
తమిళనాడు : 6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 50 కోట్లు
కేరళ : 2 కోట్లు
ఓవర్సీస్ : 24 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 200 కోట్లు.