Begin typing your search above and press return to search.
ఉత్తరాదిన తగ్గేదేలే! సక్సెస్ కి షాకిచ్చే కారణం?
By: Tupaki Desk | 11 Jan 2022 1:30 PM GMTతెలుగు భాషకి ఎన్నో మాండలీకాలున్నాయి. భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి మాండలీకం మారుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఒకలా..ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరోలా...ఉభయగోదావరి జిల్లాలో ఒకలా భాషలో మాండలికాలున్నాయి. అయితే ఏపీలో ఎన్ని మాండలికాలున్నా...శ్రీకాకుళం...చిత్తూరు జిల్లా మాండలికాలు మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనవిగా చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన `పుష్ప` సినిమా పూర్తిగా చిత్తూరు మాండలికంలోనే సంభాషణలుంటాయి. శేషాచలం అడవుల్లో జరిగే గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం కావడం...ఆ రకమైన జీవన విధానానికి అలవాటు పడిన ప్రజలు ఎలా ఉంటారు? వాళ్ల విధానం..కల్చర్ ఎంత మాసీగా ఉంటుందన్నది సుకుమార్ కొన్ని దశాబ్ధాల ముందుకెళ్లి తన కథ రూపంలో చెప్పే ప్రయత్నం పెద్ద రేంజులో సక్సెస్ అయింది. ఇది నార్త్ లో మరింత గొప్పగా కనెక్టయ్యింది.
అయితే చిత్తూరు మాండలికం మొదట్లో అర్ధం కావడానికి కొంచెం సమయం పడుతుంది. అర్ధమైతే అందులో కొత్త అనుభూతి.. కావాల్సినంత హాస్యం దొరుకుతుంది. మిగతా ప్రాంతాల వారికి పూర్తిగా కొత్త యాసలా అనిపిస్తుంది. సరిగ్గా సుకుమార్ ఇదే పాయింట్ ని సక్సెస్ గా మార్చుకున్నారు. కథాంశం ప్రాంతం..నిర్ధింష్టంగా ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రామాణికతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ సంగతి పక్కనబెడితే ఉత్తర భారతంలో సినిమా సక్సెస్ కారణం దీన్నే చెప్పొచ్చు. ఈ విషయాన్ని బన్నీ సైతం చెప్పారు. ప్రామాణికత..మేకింగ్ పై తమకున్న నమ్మకమే నిలబెట్టిందన్నారు.
ఈ సక్సెస్ తర్వాత బన్నీ బహుభాషా చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి సిద్దంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. హిందీతో పాటు.. ఇతర భాషల సినిమాల్లో నటించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రదర్శన అనేది నటుడి మనస్థత్వం తప్ప.. మరొకటి కాదు. అది ఎంత విశాలంగా ఉంటే.. అంత విస్తృతంగా చేరుకోవచ్చు అని అన్నారు. ప్రస్తుతం `పుష్ప` రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తరహాలో కొత్తదనంతో ఆకట్టుకున్న పుష్పకు సీక్వెల్ తెరకెక్కితే నార్త్ లోనూ ఈ సీక్వెల్ పై ఎలాంటి హైప్ ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. బన్ని అందుకే ఇప్పుడు తగ్గేదేలే అంటూ ఫిబ్రవరి నుంచి సుక్కూతో పుష్ప -2 చిత్రీకరణకు వెళతారని భావిస్తున్నారు.