Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ 110 కోట్లు..!

By:  Tupaki Desk   |   16 Oct 2018 1:30 AM GMT
ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ 110 కోట్లు..!
X
సౌత్ లో ఒక టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? నయనతార ఒక సినిమాకు మూడు నుండి మూడున్నర కోట్ల తీసుకుంటుందని టాక్. అదే బాలీవుడ్ విషయం తీసుకుంటే టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ రూ. 10 కోట్లకు అటూ ఇటుగా ఉంటుంది. ఇక బాలీవుడ్ నుండి మనం టాపిక్ ని హాలీవుడ్ కు తీసుకెళ్దాం. ఒక స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చు?

ఎంత ఉండొచ్చో.. ఎంత ఉంటుందో అని ఊహించనవసరం లేదు. మర్వెల్ స్టూడియోస్ వారు తాము నిర్మించనున్న చిత్రం కోసం హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ కు $15 మిలియన్స్ ఆఫర్ చేశారట. ఇది మన కరెన్సీలో దాదాపుగా రూ. 110 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒక హీరోయిన్ కు ఇది బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. స్కార్లెట్ జాన్సన్ మార్వెల్ వారు నిర్మించిన 'అవెంజర్స్' సీరిస్ లో తెరకెక్కిన పలు సినిమాలో నటించింది. ఇక ఈ సీరీస్ లో లేటెస్ట్ ఫిలిం అయిన 'ఆవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్కార్లెట్ జాన్సన్ 'నటాషా రోమనోఫ్/బ్లాక్ విడో' పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ బ్లాక్ విడో ప్రధాన పాత్రలో మార్వెల్ వారు ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసమే స్కార్లెట్ కు కనీవినీ ఎరుగని మొత్తాన్ని రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడం జరిగింది.

స్కార్లెట్ రెమ్యునరేషన్ హాలీవుడ్ లో టాప్ మేల్ స్టార్స్ కు ఆఫర్ చేసే రెమ్యునరేషన్ తో సమానం. మరి హీరోలతో సమానంగా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్ లలో నటించడమే కాదు సినిమాను ఒంటి చేతిమీద నిలబెట్టగలిగే సత్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే రేంజ్ రెమ్యునరేషన్ వస్తుంది కదా?