Begin typing your search above and press return to search.
సెకండ్ టైమ్ 'ఉప్పెన - మాస్టర్' సినిమాలకు షాకింగ్ టిఆర్పీ రేటింగ్..!
By: Tupaki Desk | 24 Jun 2021 5:30 PM GMTదేశంలో మొదటి లాక్డౌన్ తర్వాత దక్షిణాది ఇండస్ట్రీలో రిలీజ్ అయినటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ నమోదు చేసి రికార్డులు క్రియేట్ చేసాయి. అయితే జనవరిలో దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా.. ఫిబ్రవరిలో పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. అయితే ఆ సినిమాలు అదే అంచనాలతో వెండితెరపై నుండి బుల్లితెర మీదకు వచ్చేసరికి ఫలితం వేరేలా ఉంటుంది. ఎందుకంటే మెగాహీరో వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన మూవీ ఉప్పెన. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేయడంతో సినిమా భారీ విజయం అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అయితే మరోవైపు దళపతి విజయ్ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలలో తెరకెక్కింది మాస్టర్. యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. అలాగే స్టార్స్ విజయ్, సేతుపతిల కారణంగా డబుల్ సెంచరీ క్రోర్స్ వసూల్ క్రాస్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలకు ప్లస్ పాయింట్ ఏంటంటే.. థియేటర్స్ లో 100% అక్యూపెన్సీ లభించడం. ఆ విధంగా ఇటు ఉప్పెన.. అటు మాస్టర్ (తమిళ, తెలుగు) భాషల్లో మంచి రికార్డులు నమోదు చేసాయి.
అయితే మాములుగా థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి సినిమాలు టీవీలో ప్రసారమైతే ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ వేరువేరు ఛానల్స్ లో ఒకేసారి వేస్తే మాత్రం రెండింటికి న్యాయం చేయడం కష్టమే అవుతుంది. ఈ రెండు సినిమాలు ఓటిటి అయిన వెంటనే టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. కానీ టిఆర్పీ రేటింగ్ చూస్తే షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే దళపతి విజయ్ కంటే మెగాహీరో మూవీ మెగా టిఆర్పీ రేటింగ్ రాబట్టుకుంది. మొదటిసారి ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా 'స్టార్ మా' ఛానల్లో.. మాస్టర్ సినిమా జెమినీ ఛానల్లో ప్రసారమయ్యాయి. మరి థియేటర్లో దుమ్ము దులిపిన సినిమాలు టీవీలో ఎలాంటి టిఆర్పి రేటింగ్ నమోదు చేసాయంటే.. ఉప్పెనకు మొదటిసారి 18.5 టిఆర్పీ రేటింగ్ రాగా.. మాస్టర్ 4.8 రేటింగ్ వచ్చింది. అయితే ఇటీవలే ఈ రెండు సినిమాలు సెకండ్ టైం టీవీలో వచ్చాయి. కానీ ఈసారి ఉప్పెన 11.37 టిఆర్పీ తెచ్చుకోగా మాస్టర్ 3.8 రేటింగ్ పొందింది. మొత్తానికి థియేట్రికల్ హిట్ అయిన సినిమాలు టీవీలో పరవాలేదని అనిపించుకున్నాయి.