Begin typing your search above and press return to search.
షాకింగ్ నిజం: ‘మా’ బైలాస్ మూడు పేజీలే
By: Tupaki Desk | 3 July 2021 4:07 AM GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. సింఫుల్ గా ‘మా’ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తానని ప్రకటించినప్పటికి నుంచి వాతావరణం హాట్ హాట్ గా మారింది. గతంలో ఏకగ్రీవంగా జరిగే పరిస్థితి నుంచి పోటాపోటీగా ఎన్నికలు జరిగే వరకు వెళ్లటం తెలిసిందే. తాజాగా ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మా అసోసియేషన్ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎవరు బరిలో ఉంటారో.. మరెవరు వైదొలుగుతారో అన్న చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. ‘మా’ అసోసియేషన్ కు సంబంధించిన పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. 900 మంది సభ్యులున్న మా అసోసియేషన్ కు సంబంధించి రాజ్యంగంగా భావించే బైలాస్ గురించిన కొత్త విషయం బయటకు వచ్చింది.
సాధారణంగా ఒక చిన్న అపార్ట్ మెంట్ అసోసియేషన్ ను సైతం రిజిస్టర్ చేస్తే.. దాని బైలాస్ తక్కువలో తక్కువ నాలుగైదు పేజీలు ఉంటాయి. కానీ.. విచిత్రంగా మా అసోసియేషన్ బైలాస్ మాత్రం కేవలం మూడు పేజీలు మాత్రమే ఉండటం.. తాజాగా ఆ విషయం బయటకు రావటం సంచలనంగా మారింది. సినిమా రంగానికి చెందిన ఈ అసోసియేషన్ ఎంత పకడ్బందీగా ఉందన్న విషయం దాని బైలాస్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ బైలాస్ ను లాయర్ కాకుండా ఒక ఆడిటర్ తయారుచేశారని చెబుతున్నారు. దీంతో పలు న్యాయపరమైన అంశాల ప్రస్తావన లేదని.. ఏ విషయం మీద స్పష్టత లేదని చెబుతున్నారు. సాధారణంగా బైలాస్ తయారు చేసేటప్పుడు.. సంస్థ స్వరూపం.. స్వభావంతో పాటు.. న్యాయపరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకోవటం చేస్తారు. అందుకు భిన్నంగా వేటిని పట్టించుకోకుండా తూతూ మంత్రంగా రూపొందించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.