Begin typing your search above and press return to search.
మహర్షిలో షాకింగ్ ట్విస్ట్!
By: Tupaki Desk | 1 April 2019 7:48 AM GMTఇంకో 38 రోజులు కౌంట్ డౌన్ పూర్తి చేసుకుంటే మహర్షి థియేటర్లో అడుగుపెడతాడు. అభిమానులు ఎప్పుడెప్పుడు ఇవి పూర్తవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేట్ మూడు సార్లు వాయిదా పడటంతో కొంత అసహనంగా ఉన్నప్పటికీ ష్యూర్ షాట్ హిట్ అనే నమ్మకంతో ఆలస్యాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికి ఓ ఆడియో సింగల్ మాత్రమే బయటికి వచ్చింది. చోటి చోటి బాతే పాట మరీ భారీగా కాదు కాని ఓ మాదిరి స్పందనతో పాజిటివ్ గానే ఉంది.
ఇదిలా ఉండగా మహర్షి స్టొరీకి సంబంధించి ఓ కీలకమైన లీక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం మహర్షిలో అల్లరి నరేష్ పాత్ర సెకండ్ హాఫ్ కు ముందే చనిపోతుందట. దాని తర్వాతే అమెరికాలో ఉన్న మహర్షి దానికి కారణం తెలుసుకుని ఫ్రెండ్ ఉండే పల్లెటూరికి వచ్చి అతని లక్ష్యం కోసం నడుం బిగిస్తాడు. అక్కడి నుంచి విలన్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరోవైపు సమాజ సేవ ఇలా ఓ రేంజ్ లో హీరోయిజంతో పాటు మెసేజ్ కూడా ఉంటుందట
అసలు నరేష్ ఎందుకు చనిపోతాడు స్నేహితుడు దేని కోసం పోరాడి ప్రాణాలు వదిలాడు లాంటివి తెలుసుకున్నాకే మహర్షికి కర్తవ్యం బోధపడుతుంది. అందుకే కోట్ల రూపాయల సంపదను వదిలి గ్రామానికి వస్తాడు. అక్కడివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. ఇదంతా ఫిలిం నగర్ లో జరుగుతున్న ప్రచారమే. ఇది నిజం కావొచ్చు కాకపోవచ్చు కాని టీజర్ ని బట్టి మేకింగ్ షాట్స్ ని బట్టి చూస్తే లైన్ కాస్త దగ్గరిగానే అనిపిస్తోంది.
ఏది ఉన్నా మహేష్ సినిమాలో మినిమం మసాలా ఉంటే చాలు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. అందులోనూ దర్శకుడు వంశీ పైడిపల్లి ఏళ్ళ కష్టం కాబట్టి మహర్షిలో బలమైన కంటెంట్ ఉండే ఉంటుంది. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో పైన చెప్పిన కారణంగానే అల్లరి నరేష్ కి జోడి సెట్ చేయలేదని టాక్.