Begin typing your search above and press return to search.

రెండు సార్లు అద్దం చూపించి బెదిరించింద‌ట‌

By:  Tupaki Desk   |   19 Dec 2021 2:30 AM GMT
రెండు సార్లు అద్దం చూపించి బెదిరించింద‌ట‌
X
వార‌సురాలిని పెద్ద స్టార్ గా చూడాల‌ని కోరుకోని మామ్ ఉండ‌దు. అంద‌రిలానే ఆ మ‌మ్మీ కూడా క‌ల‌లు కంది. అయితే అప్ప‌టికి కుమార్తె బ‌రువు 120 ప్ల‌స్. అంత వెయిట్ ని త‌గ్గించి క‌థానాయిక లా క‌నిపించే షేప్ లు తేవాలంటే అంత సులువేమీ కాదు.

దానికోసం మామ్ అమృత సింగ్ కూతురు సారాపై ఒత్తిడి తెచ్చింద‌ట‌. ఆ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా వెల్ల‌డించింది. అమృతా సింగ్ తనకు `తున్ తున్ కా జమానా గయా` అని చెప్పిందని.. నటిగా మారడానికి బరువు తగ్గాలని కోరింద‌ని సారా అలీ ఖాన్ చెప్పారు. తన తల్లి అమృతా సింగ్ తన జీవితాన్ని మార్చే విధంగా.... రెండు సందర్భాలలో అద్దం ఎలా చూపించిందో కూడా వెల్లడించారు.

ఆ రెండుసార్లు త‌న‌కు రియాలిటీ చెక్ ఎలానో చూపించింద‌ట మామ్. మొదటిది సారా వెల్లడించింది. హెవీ వెయిట్ వ‌ల్ల‌ అవమానాలు లేకుండా నిజమైన మార్గంలో ఆరోగ్యంగా ఉండాలని ఆమె నాకు చెప్పింది. నా స్వార్థం కోసం కూడా నేను స్లిమ్ అవ్వాలి. ఇది వ్యర్థం మాత్రమే కాదు.. ఇది ఆరోగ్య విషయం కూడా. ఆ సమయంలో ఆమె నాకు అద్దం చూపించింది.. అని ఆర్జే సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా చెప్పింది.

లవ్ ఆజ్ కల్ విఫలమైనప్పుడు అమృత నుండి తనకు రెండవ రియాలిటీ చెక్ ల‌భించింద‌ని సారా చెప్పింది. “లవ్ ఆజ్ కల్ వ‌ర్క‌వుట్ కాన‌ప్పుడు ఆమె నాకు అద్దం చూపించి. నేను నీ మ‌మ్మీని. మీ టీమ్ లో ఉంటే.. మీరు ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తారని నేను అనుకుంటాను. అంటూ మ‌రోసారి నాకు అద్దం చూపించింది`` అని తెలిపారు.

సారా తదుపరి అట్రాంగి రేలో కనిపించనుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె అక్షయ్ కుమార్ - ధనుష్ లకు జోడీగా కనిపించనుంది. అట్రాంగి రే థియేటర్లకు బ‌దులుగా నేరుగా డిసెంబర్ 24న డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలవుతోంది.