Begin typing your search above and press return to search.
అలాంటి టైమ్ లో షూటింగ్.. రవితేజ ది గ్రేట్ అంటున్న శ్రీలీల..!
By: Tupaki Desk | 19 Dec 2022 8:34 AM GMTరవితేజ కమిట్మెంట్ గురించి ధమాకా ప్రీ రిలీజ్ ఈవెట్ లో ఆడియన్స్ తో పంచుకున్నారు హీరోయిన్ శ్రీలీల. ఆయనతో జత కట్టి చేసిన ఈ ధమాకా సినిమాని నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశారు. కన్నడలో యువ హీరోయిన్ గా రెచ్చిపోతున్న శ్రీలీల తెలుగులో పెళ్లిసందD సినిమాలో నటించింది. ఆ మూవీతో ఆడియన్స్ ని మెప్పించిన అమ్మడు రవితేజ ఛాన్స్ అందుకుంది.
రవితేజ సినిమా సెట్స్ మీద ఉండగానే అమ్మడు మరో రెండు సినిమాల ఛాన్స్ లు అందుకుంది. ఇక ధమాకా సినిమా టైం లో రవితేజ ఎనర్జీ.. ఎఫర్ట్స్ గురించి శ్రీలీల బాగా చెప్పింది. ఒక సాంగ్ షూటింగ్ లో కాలికి 12 కుట్ల దాకా పడినా సరే ఆ పెయిన్ ఎక్కడా కనిపించకుండా రవితేజ నటించారని.. తనకు ఇష్టమైన హీరో రవితేజ అని అన్నారు శ్రీలీల.
ఈ కష్టం ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టిన అతని కెరీర్ స్టార్ గా మారిన టైం వరకు మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ లో ఎన్నో రిస్క్ లు ఉన్నాయి. 12 కుట్లు పడినా డ్యాన్స్ చేశారని శ్రీలీల రవితేజ కష్టం గురించి చెప్పగా.. అతన్ని చిన్న పాత్రల నుంచి స్టార్ గా ఎదిగేంతవరకు చూసిన ప్రేక్షకులు.. ఆ కష్టం తో పోల్చితే ఇదేమంత కష్టం కాదులే అనుకుంటున్నారు.
మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులు దోచేసిన శ్రీలీల ధమాకాతో డబుల్ ధమాకా ఇవ్వనుంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం అమ్మడికి వరుస ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. అమ్మడి దూకుడు చూస్తుంటే శ్రీలీల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారడం పక్కా అని చెప్పొచ్చు. తెలుగులో ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన్ చేస్తుంది శ్రీలీల.
శ్రీలీల నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికో వెళ్తుందని రవితేజ కూడా అన్నారు. ఎంతో టాలెంట్ ఉన్న నటి అని.. తప్పకుండా ఆమె చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని అన్నారు రవితేజ. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ధమాకా ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.