Begin typing your search above and press return to search.

ఇక్క‌డా అక్క‌డా అదే స‌మ‌స్యపై చ‌ర్చ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:10 AM GMT
ఇక్క‌డా అక్క‌డా అదే స‌మ‌స్యపై చ‌ర్చ మొద‌లైందా?
X
గ‌త కొన్ని నెల‌లుగా టాలీవుడ్ విజ‌యాలు ప్ర‌తీ ఒక్క‌రినీ అబ్బుర ప‌రిచిన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలు మ‌న విజ‌యాలు చూసి యావ‌త్ దేశం గొప్ప‌గా చెప్పుకుంటుంటే మ‌న‌తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీలు కూడా గ‌ర్వించాయి. ప్రౌడ్ గా ఫీల‌య్యాయి. అయితే బాలీవుడ్ ..బాలీవుడ్ స్టార్స్, మేక‌ర్స్ మాత్రం నొచ్చుకున్నారు. ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ మాత్ర‌మే అనే ప్ర‌చారం జ‌రిగింది. బాలీవుడ్ కూడా అదే నిజ‌మ‌ని ఫీల‌య్యారు.. చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ ఒక్క‌సారిగా 'బాహుబ‌లి'తో ప్ర‌పంచానికి టాలీవుడ్ వుంద‌ని, ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ మాత్ర‌మే కాద‌ని తేట‌తెల్లమైంది.

దీంతో బాలీవుడ్ వ‌ర్గాల‌కు మ‌న సినిమా గొప్ప‌ద‌నాన్ని ఒప్పుకోవ‌డానికి ముందు అహం అడ్డొచ్చినా ఆ త‌రువాత నుంచి అంగీక‌రించ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌శంస‌లు కురిపించ‌డం స్టార్ట్ చేశారు. అక్క‌డి నుంచే బాలీవుడ్ పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సౌత్ ని చూసైనా నేర్చుకోండి అంటూ విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు.

ఇదిలా వుంటే కోవిడ్ త‌రువాత బాలీవుడ్ మ‌రింత‌గా ప‌తనావ‌స్థ‌కు చేరిందా? అంటూ విమ‌ర్శిలు రావ‌డం మొద‌లైంది. దానికి కార‌ణం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల వ‌ర్షం కురిపిస్తుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం స్టార్ బ్యాట్స్ మెన్ ల‌లా బ్యాట్ తిప్పుకుంటూ వెళ్లి బ్యాక్ టు బ్యాక్ పెవిలియ‌న్ కు చేరుకుంటున్న క్రికెటర్ల త‌ర‌హాలో షాకిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ బ్లీడింగ్ అంటూ క్రిటిక్స్ చేస్తున్న విమ‌ర్శ‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ ఈ స్థాయిలో ఫ్లాపుల్ని ఎదుర్కోవ‌డానికి కార‌ణం కంటెంట్, అదే విధంగా స్టార్స్ రెమ్యున‌రేష‌న్స్‌.టాలీవుడ్ స్టార్ల కంటే బాలీవుడ్ స్టార్లు అత్య‌ధిక మొత్తంలో పారితోషికాల‌తో పాటు ఇత‌ర సౌక‌ర్యాల‌కు కూడా నిర్మాత‌ల‌ని పిండేస్తుంటారు. అంటే కాకుండా వారి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఖ‌ర్చుని క‌రూడా భారీగానే నిర్మాత‌ల‌పై మోపుతున్నార‌ట‌.

ఇది కూడా బాలీవుడ్ ని ప్ర‌స్తుతం స్థితికి తీసుకొచ్చింద‌ని బాలీవుడ్ క్రిటిక్స్ కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక్కో స్టార్ హీరో వంద కోట్లకు మించి వ‌సూలు చేస్తుండ‌టం, అక్ష‌య్ కుమార్ లాంటి హీరో ఏకంగా వంద కోట్ల‌కు మించి డిమాండ్ చేస్తుండ‌టం ర‌ణ్ బీర్ క‌పూర్‌, ర‌ణ్ వీర్ సింగ్ లాంటి హీరోలు 50 కోట్ల‌కు మించి వ‌సూలు చేస్తుండ‌టంతో బాలీవుడ్ సినిమాలు భారంగా మారాయ‌నే విమర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా మారింద‌న్న‌ది తాజా విమ‌ర్శ‌.

రీసెంట్ గా విడుద‌లైన సినిమాలు కోట్ల‌ల్లో న‌ష్టాల‌ని తెచ్చిపెట్ట‌డంతో ఇప్ప‌టు హీరోల రెమ్యున‌రేష‌న్ ల‌పై బాలీవుడ్ లో చ‌ర్చ మొద‌లైంది. ఇదిలా వుంటే టాలీవుడ్ లోనూ ఇదే త‌ర‌హా స‌మస్యల కార‌ణంగా ఆగ‌స్టు 1 నుంచి నిర్మాత‌లు షూటింగ్ ల బంద్ కు పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. మ‌న స్టార్ హీరోల పారితోషికాలు కూడా ఇంచు మించి బాలీవుడ్ హీరోల స్థాయికి చేర‌డంతో టాలీవుడ్ నిర్మాత‌ల‌కు సినిమాల నిర్మాణం త‌ల‌కు మించిన భారంగా మారిన విష‌యం తెలిసిందే. ఇలా ఇక్క‌డా అక్క‌డా రెమ్యున‌రేష‌న్ ల‌పై ఒకే సారి చ‌ర్చ మొద‌లు కావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.