Begin typing your search above and press return to search.
షార్ట్ ఫిలిం నటిని వేధిస్తున్న దర్శకుడు బుక్
By: Tupaki Desk | 23 Dec 2017 4:32 AM GMTషార్ట్ ఫిలింస్ లో నటిస్తున్న ఒక మహిళను వేధిస్తున్న సినీ దర్శకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళ ఒకరు.. సినిమాల మీద ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నారు. అయితే.. ఆమెను అసభ్యరీతిలో వేధిస్తున్న వైనంపై చేసిన ఫిర్యాదులో సదరు దర్శకుడ్ని అదుపలోకి తీసుకున్నాయి షీ టీం బృందాలు.ఇంతకీ జరిగిందేమంటే..
గచ్చిబౌలిలోని హిల్ డ్రీజ్ అపార్ట్ మెంట్లో ఉంటున్న హారిక ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఆమెకు యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఎక్కువ. దీంతో..అవకాశం లభించినప్పుడల్లా షార్ట్ ఫిలింస్ లో నటిస్తుంటారు. ఈ క్రమంలో ఆమెకు సినీ దర్శకుడిగా యోగి పరిచయమయ్యాడు.
ఈ క్రమంలో వ్యక్తిగత అవసరాల కోసం రూ.10వేలను హారిక నుంచి తీసుకున్నాడు యోగి. అనంతరం తాను ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని హారిక కోరింది. అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంతలోనే ఆమెకు అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు పంపటం ఎక్కువైంది దీంతో మానసిక వేదనకు గురైన ఆమె.. షీ టీం సాయాన్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హారికకు అసభ్యకర సందేశాల్ని పంపిస్తున్న వైనాన్ని గుర్తించిన పోలీసులు యోగిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా షీం టీం ఇన్ చార్జి అదనపు డీసీపీ గంగారెడ్డి నిందితుడ్ని విచారించారు. అయితే.. ఈ క్రమంలో దర్శకుడు యోగిని సదరు పోలీసు అధికారి కాళ్లతో కొట్టిన వైనం ఇప్పుడు బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది.