Begin typing your search above and press return to search.
జయ జానకి నాయక కు థియేటర్ల దెబ్బ?
By: Tupaki Desk | 10 Aug 2017 11:16 AM GMTఇండిపెండెన్స్ డే వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి లై, జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఒకేసారి పోటీపడనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాల జయాపజయాలు పక్కన పెడితే ఆ సినిమాలకు సంబంధించిన థియేటర్ల విషయంలో జయ జానకి నాయక కొద్దిగా వెనుక బడినట్లే ఉంది. ఈ మూడు సినిమాలలో జయ జానకి నాయకపై మంచి బిజినెస్ జరిగింది. కానీ, థియేటర్ల విషయంలో ఈ సినిమా కాస్త వెనుక బడింది. నిర్మాతలు - బయ్యర్ల అనుభవం ప్రకారమే ఆ సినిమాలకు థియేటర్లు దక్కాయి. జయ జానకి నాయక సినిమాకు థియేటర్ల కేటాయింపు పరంగా అన్యాయం జరిగనట్లు కనిపిస్తోంది.
ఒక్క సీడెడ్ ఏరియాను ఉదాహరణగా తీసుకుంటే 'నేనే రాజు నేనే మంత్రి'కి డెబ్బయ్ థియేటర్లు, 'లై'కి అరవై థియేటర్లు ఉన్నాయి. కానీ, 'జయ జానకి నాయక'కి నలభై థియేటర్లు కూడా దొరకలేదు. ఈ సినిమా నిర్మాత కొత్త వాడు కావడం, ఆ సినిమా కొన్న బయ్యర్లతో చాలా మందికి అనుభవం లేకపోవడం ఇందుకు కారణం. దీంతో, మాస్ ఏరియాల్లోను ఎక్కువ థియేటర్లు దొరకని పరిస్థితి. జయ జానకి నాయక సీడెడ్ రైట్స్ ఏడు కోట్ల ఇరవై లక్షలకి అమ్మితే, లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు అందులో సగం ధర కూడా పలకకపోవడం విశేషం.
నేనే రాజు నేనే మంత్రి సినిమా కు అధిక థియేటర్లు దక్కడానికి నిర్మాత సురేష్ బాబే కారణం. ఆయనకు ఉన్న థియేటర్స్ చెయిన్ వల్ల 'నేనే రాజు నేనే మంత్రికి అధిక థియేటర్లు దొరికాయి. డిస్ట్రిబ్యూటర్ల వల్ల 'లై' లాంటి క్లాస్ సినిమాకు మాస్ ఏరియాల్లో కూడా చాలా థియేటర్లు దొరికాయి. సీడెడ్ లోని పరిస్థతి అన్ని ఏరియాల్లోనూ ఉంది. దీంతో, 'జయ జానకి నాయక మొదటి వారం కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఒకవేళ సినిమా బాగుందనే మౌత్ టాక్ వల్ల సినిమా కలెక్షన్లు పెరగవచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.