Begin typing your search above and press return to search.
మెగా హీరోలు ట్రాక్ మార్చాల్సిందేనా?
By: Tupaki Desk | 6 Sep 2022 4:30 PM GMTమెగా హీరోల్లో కొంత మంది ఈ ఊ ఏడాది ప్రారంభం నుంచి అస్సల కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు మెగా హీరోలు కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `RRR`తో పాన్ ఇండియా స్టార్ గా మారితే.. మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ నటించిన `ఆచార్య` భారీ అంచనాల మధ్య విడుదలై చిరు కెరీర్ లోనే ఈ మధ్య కాలంటే రాని డిజాస్టర్ గా నిలిచింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే కథలో దమ్ములేకపోవడంతో ఈ మూవీని ప్రేక్షకులు, అభిమానులు డిజాస్టర్ గా తేల్చారు. దీంతో ఈ మూవీ బయ్యర్లకు భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన సెటిల్ మెంట్ లు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫలితంతో షాక్ కు గురైన ఫ్యాన్స్ చిరు పంథా మార్చాల్సిందే అంటున్నారు.
ఇక ఇదే ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా `ఎఫ్ 3`తో ఫరవాలేదనిపించినా ఆ సినిమాపై కామెంట్ లు వినిపించాయి. బొత్తిగా బీసీ కాలం నాటి కథతో దర్శకుడు బావురు మనిపించాడని సెటైర్లు వేశారు. ఈ మూవీకి ముందు వరుణ్ తేజ్ నటించిన `గని` అట్టర్ ఫ్లాప్ గా నిలిచి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి హేమా హేమీలు నటించినా సరైన కథ లేకపోవడంతో ఈ మూవీ జనాలని ఆకట్టుకోలేకపోయిందని ప్రేక్షకులు, అభిమానులు పెదవి విరిచారు.
ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వరుణ్ తేజ్ తన 12వ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వరుణ్ తేజ్ తన 12 వ ప్రాజెక్ట్ ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అత్యధిక భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జున తో `ది ఘోస్ట్` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే.
ఇది అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే `ఉప్పెన`తో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన వైష్ణవ్ తేజ్ ఆ తరువాత ఆ క్రేజ్ ని కాపాడుకోలేకపోతున్నాడు. వెంటనే క్రిష్ తో `కొండ పొలం` అంటూ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. రీసెంట్ గా గిరీషాయతో చేసిన `రంగ రంగ వైభవంగ` కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేక షాకిచ్చింది. ఈ నేపథ్యంలో పంజా వైష్ణవ్ తేజ్ కూడా తన పంథా మార్చుకుని కొత్త తరమా సినిమాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.