Begin typing your search above and press return to search.
మహేష్ తో త్రివిక్రమ్ మ్యాజిక్ చేయాల్సిందేనా?
By: Tupaki Desk | 25 May 2022 1:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్ లు వినిపించాయి. అంతే కాకుండా కలెక్షన్స్ పరంగానూ ఈమూవీ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కావడం కష్టం అని కూడా చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తూ 'సర్కారు వారి పాట' ఫ్యాన్స్ కే కాదు మహేష్ రేంజ్ కి కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే వాదన చాలా మందిలోనూ వినిపిస్తోంది.
కంటెంట్ పరంగా మహేష్ సాలీడ్ హిట్ ని సొంతం చేసుకుని చాలా రోజులే అవుతోంది. ఇప్పడు ఆ టైమ్ వచ్చిందని చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం 'శ్రీమంతుడు'తో సాలీడ్ హిట్ ని సొంతం చేసుకుని రెట్టించిన జోష్ తో కనిపించిన మహేష్ ఇప్పడు మళ్లీ అలాంటి మ్యాజిక్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఓ భారీ మూవీ చేయబోతున్న సందర్భంగా ఈ మూవీపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
'ఖలేజా' తరువాత దాదాపు 12 ఏళ్ల అనంతరం త్రివిక్రమ్ - మహేష్ కలిసి సినిమా చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించబోతున్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి దాదాపు ఏడాది కావస్తోంది. మహేష్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఇప్పడు ఈ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరిద్దరి ట్రాక్ రికార్డ్ మాత్రం కొంత వరకు ఫ్యాన్స్ ని కంగారు పెడుతోంది. గతంలో వీరిద్దరి కలియికలో వచ్చిన 'అతడు' ఫరావాలేదనిపించి బడ్జెట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై 'అతడు' మూవీ చేశారు. ఈ మూవీకి పెట్టిన ఖర్చు కూడా రాలేదని అప్పట్లో టాక్ నడిచింది. ఇక 'ఖలేజా' గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో చేసిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచి ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచయింది. అయితే 'అల వైకుంఠపురములో' చిత్రంతో ట్రాక్ లో కి వచ్చిన త్రివిక్రమ్ ఈ సారి మహేష్ ఎలాగైనా మ్యాజిక్ చేస్తాడని, గత రికార్డుకు పూర్తి భిన్నంగా మహేష్ కు సాలీడ్ బ్లాక్ బస్టర్ ని అందిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైనల్ మీటింగ్ త్వరలో దుబాయ్ లో జరగబోతోంది. ఇప్పటికే నమ్రత ప్రజెన్స్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ ని ముగించుకుని హైదరాబాద్ తిరిగి రాగానే జూలూ నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్న విధంగా నే మహేష్ తో త్రివిక్రమ్ మ్యాజిక్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.