Begin typing your search above and press return to search.
మహేష్ కోసం త్రివిక్రమ్ వేయిట్ చేయక తప్పదా?
By: Tupaki Desk | 10 Nov 2022 2:30 AM GMTసూపర్ స్టార్ మహేష్‌బాబు - త్రివిక్రమ్ దాదాపు పుష్కర కాలం తరువాత మళ్లీ కలిసి పని చేస్తున్నారు. `ఖలేజా` తరువా వీరిద్దరి కాంబినేషన్ కు గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత వీరిద్దరు కలిసి SSMB28 కోసం పని చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న మూడు నెలల తరువాత ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు.
అభిమానులు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు సెప్టెంబర్ 12న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టారు. మహేష్ తో పాటు కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా అన్బు అరివు హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేశారు. అన్న పూర్ణ స్టూడియోస్ లో మూడు రోజుల షూటింగ్ తరువాత చిత్ర బృందం షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చేసింది.
అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించిన అనంతరం ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కు బ్రేకిచ్చింది. ఆ సమయంలోనే మహేష్ తల్లి ఇందిరా దేవి మృతి చెందడం, ఆ తరువాత మహేష్ ఫ్యామిలీతో కలిసి లండన్ విహార యాత్రకు వెళ్లడం తెలిసిందే. తిరిగి మహేష్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ కి వినిపించలేదట. ఆ కారణంగానే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ కి త్రివిక్రమ్ వినిపించాడట. అయితే తదుపరి షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే వుండాలి. తనతో కలిసి కాంబినేషన్ సీన్స్ వున్నాయట. అయితే ఇటీవల పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో తను రెస్ట్ తీసుకుంటోంది. డిసెంబర్ కి కానీ తను సెట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ని డిసెంబర్ లో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పటికి పూజా హెగ్డే గాయం నయం కానుంది కాబట్టి తను కూడా సెట్ లోకి రావడానికి రెడీగా వుంటుంది కాబట్టి డిసెంబర్ లో తదుపరి షెడ్యూల్ ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.