Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి 'జీ5' బ్యాడ్ సెంటిమెంటుగా మారనుందా..?

By:  Tupaki Desk   |   30 May 2021 1:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి జీ5 బ్యాడ్ సెంటిమెంటుగా మారనుందా..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్‌ మరియు శాటిలైట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌ సంస్థ.. ఇటీవలే పది భాషల మూవీ హక్కులను అమ్మేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

'RRR' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. అలానే దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్ స్టార్‌ గ్రూప్ వారు చేజిక్కించుకోగా.. హిందీ శాటిలైట్‌ 'జీ సినిమా' సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రానికి జీ5 బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతుందేమో అని సినీ అభిమానులు భయపడుతున్నారు.

ఎందుకంటే జీ గ్రూప్ వారు కొనే సినిమాల్లో ఎక్కువ శాతం ప్లాపులే ఉన్నాయి. ఈ ఛాన‌ల్ వారు కొన్న సినిమాల్లో చాలా వరకు డిజాస్ట‌ర్లు కూడా ఉన్నాయి. 'స్పైడ‌ర్' 'రాధే' వంటి చాలా సినిమాలను జీ గ్రూప్ వారే కొనుగోలు చేశారు. ఎన్నో అంచనాల మ‌ధ్య వచ్చిన ఈ సినిమా రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదే RRR కి బ్యాడ్ సెంటిమెంట్ అవుతుందేమో అంటున్నారు. మ‌రి దర్శకధీరుడి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ముందు జీ5 బ్యాడ్ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోతుందేమో చూడాలి.

ఇకపోతే ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లిష్‌ - పోర్చుగీస్‌ - కొరియన్‌ - టర్కిష్‌ - స్పానిష్‌ వంటి ఐదు అంతర్జాతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. హిందీతో పాటుగా విదేశీ భాషలకి చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.