Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడిపై అమితమైన అభిమానం చూపిస్తోంది
By: Tupaki Desk | 2 Feb 2022 3:30 PM GMTఅదితి రావ్ హైదరీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అందంతో పాటు నటన పరంగా మంచి ప్రతిభ ఉన్న హీరోయిన్ ఈమె. 2006 సంవత్సరంలో హీరోయిన్ గా మలయాళం సినిమా ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత తమిళం మరియు హిందీ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. స్కిన్ షో చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలనే తాపత్రయం లేకుండా మంచి పాత్రలు చేసి నటిగా గుర్తింపు దక్కించుకోవాలనుకుంది. అందుకే ఆమె చాలా అరుదుగా సినిమాలు చేస్తూ వచ్చింది.
తెలుగులో ఈ అమ్మడు సమ్మోహనం అనే సినిమా తో 2018 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తో నటిగా మంచి పేరును ఈ అమ్మడు దక్కించుకున్న విషయం తెల్సిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు అవకాశం ఉంటే తమిల దర్శకుడు మణిరత్నం సర్ మాదిరిగా మారి పోవాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన తరహా లో తమిళం నేర్చుకుని ఇతర భాషల్లో సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా తనకు మంచి అవకాశాలు ఇచ్చిన మణిరత్నం పై ఆమె అభిమానం చూపించడం కామన్ విషయం. కాని ఒక దర్శకుడిపై హీరోయిన్ ఇంత అభిమానం చూపించడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. దర్శకుడిగా ఆయన్ను అభిమానించడం కాకుండా ఆమె ఆరాధిస్తున్నట్లుగా ఆమె మాటలు చూస్తుంటే అర్థం అవుతుంది. హీరోయిన్ గా ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కోరుకుంటుంది.. అలాంటి పాత్రలు ఇచ్చినందువల్లే ఆయన అంటే ఇంత అమితమైన అభిమానం ఉండి ఉండవచ్చు.
గత ఏడాది ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ హీరోగా నటించిన ఆ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయినా కూడా ఆమె పాత్రకు మాత్రం మంచి పేరు దక్కింది. ఇక తమిళంలో ప్రస్తుతం హే సినామిక అనే సినిమాను చేస్తుంది.
తెలుగు లో ఈ అమ్మడు ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా ఇటీవలే వాటిని కాదన్నదట. కేవలం స్కిన్ షో కు పరిమితం అవ్వకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు అయితేనే చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు చేస్తుందేమో చూడాలి.