Begin typing your search above and press return to search.
షోలు రద్దు.. షూటింగ్స్ సెలవు..!
By: Tupaki Desk | 15 Nov 2022 8:41 AM GMTసినీ నట దిగ్గజం, నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మృతికి నివాళి అర్పిస్తూ ఇప్పటికే నిర్మాతల మండలి గురువారం షూటింగ్స్ రద్దు చేసింది. వెండితెర మీద సూపర్ స్టార్ కృష్ణ చెరగని చిరునామాగా ఉన్నారు.
నటుడిగా ఎక్కడో మొదలైన ఆయన సినీ ప్రస్థానం సూపర్ స్టార్ గా కోట్ల హృదయాలను గెలుచుకున్నారు. ఎంత గొప్ప నటుడో అంత మంచి మనిషని కృష్ణ గారు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు చెబుతుంటారు.
అంతటి మహా మనిషి మరణ వార్తతో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఘట్టమనేని అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా దిగ్బ్రాంతికి లోనయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎన్నో.. అందుకే ఆయన ఆకస్మిక మృతికి సంతాపంగా రేపు బుధవారం ఏపీ అంతటా ఉదయం ఆటని రద్దు చేస్తున్నట్టు ఏపీ థియేటర్ల యాజమాన్య సంఘం నిర్ణయం తీసుకుంది.
ఇది ఖచ్చితంగా సూపర్ స్టార్ కి వారు ఇస్తున్న రెస్పెక్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి టైం లోనే మన అభిమానం చూపించాల్సి ఉంటుంది. థియేటర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ సంతాపంగా ఏపీలో థియేటర్లు ఒక షోని రద్దు చేయడం ఆయనకు ఇస్తున్న ఘన నివాళి అని చెప్పొచ్చు.
నట శేఖర కృష్ణ కి అభిమాన సంఖ్యాబలం ఎక్కువే. అందుకే ఆయన్ని చివరి సారిగా చూద్దామని తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులంతా హైదరాబాద్ కి వస్తున్నారు. ప్రస్తుతం నానక్ రామ్ గూడ లోని కృష్ణ నివాసం వద్ద పార్ధివ దేహాన్ని ఉంచారు.
అభిమానుల సందర్శనార్ధం సాయంత్రం ఐదు గంటలకు గచ్చి బౌలి స్టేడియానికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే కృష్ణ నివాసం వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్ర రావు తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.