Begin typing your search above and press return to search.
సాహో సుందరి 'లవర్'తో చెట్టాపట్టాల్.. వైరల్!
By: Tupaki Desk | 12 Jun 2020 3:30 PM GMTలాక్‌డౌన్‌తో ఇంతకాలం ఇంట్లో నలిగిపోయిన అందాల సినీ తారలంతా.. ప్రభుత్వం సడలింపులు అమలు చేయడంతో ఒక్కొక్కరుగా ఇంట్లో నుండి బయటకు వస్తున్నారు. ఇన్నిరోజులుగా క్వారంటైన్ లో ఉన్న నటులు అలా బయట గాలి పీల్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా ఇంట్లో నుండి బయటికి వచ్చి మీడియా కంటపడింది. అయితే బయటికి తను సోలోగా రాలేదు.. తన లవర్ తో వచ్చింది. ఇక ఇద్దరు బైక్ పై చెట్టాపట్టాల్ ఏసుకొని తిరగడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ముంబైలో సినిమా షూటింగులు గురువారం మొదలయ్యాయి. పలువురు సినీతారలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ షూటింగులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మల్లికా శరావత్, శక్తికపూర్ లాంటి సినీ ప్రముఖులు వీధుల్లోకి కనిపిస్తున్నారు.
పలువురు సినీ తారలు సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ.. మరికొందరు షాపింగ్, రెస్టారెంట్ల వద్ద కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా బాలీవుడ్ తారలు హంగామా చేస్తుంటే హీరోయిన్ శ్రద్దాకపూర్ మాత్రం జాలీగా ప్రియుడితో గడిపేస్తుంది. ఇటీవలే ప్రియుడు రోహన్ శ్రేష్టతో బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో స్కూటీపై ఇద్దరు చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కారు. ముఖానికి మాస్క్‌తో, ఒంటిపై జిమ్ డ్రస్‌తో రోహన్‌తో కలిసి ఫుల్ జోష్‌తో కనిపించింది శ్రద్ధా.. స్కూటీ వెనుక సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసింది. ఇక రోహన్ తో శ్రద్దా రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. శ్రద్ధా అతడినే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రద్దాకపూర్ మాత్రం ఈ వార్తలపై మౌనం పాటిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ సరసన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.