Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బాండ్ గర్ల్ స్టైల్ లో సాహో భామ
By: Tupaki Desk | 11 May 2020 3:30 PM GMTప్రభాస్ సినిమా 'సాహో' లో నటించడంతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఎందుకో కానీ తెలుగులో శ్రద్ధాకు క్రేజ్ మాత్రం గొప్పగా రాలేదు. దీంతో సంబంధం లేకుండా హిందీలో వరసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. అందుకే శ్రద్ధకు ఇన్స్టా గ్రామ్ లో 45.1 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.
ఈ భామకు గ్లామరస్ ఫోటో షూట్లు చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య. ఒక్కోసారి శ్రద్ధ స్వయంగా ఫోటోలు పోస్ట్ చెయ్యకపోయినా గతంలో పాల్గొన్న ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలం రచ్చబండ మీద కూర్చుని డిజిటల్ కబుర్లు చెప్పుకునే వారు సరదాగా వైరల్ చేస్తుంటారు. పైన చూస్తున్న ఫోటో అలాంటిదే. ఈ ఫోటోలో శ్రద్ధ పారదర్శకంగా ఉండే ఆకు పచ్చ రంగు రిలాక్సింగ్ ఛెయిర్ లో కూర్చుని పోజిచ్చింది. ఈ ఫోటోలో శ్రద్ధ బ్లాక్ కలర్ డ్రెస్ లో జేమ్స్ బాండ్ సినిమాలలో ఉండే హీరోయిన్ లాగా కనిపిస్తోంది. ఆ ఎక్స్ ప్రెషన్ కూడా సరిగ్గా అలానే ఉంది. చేతిలో గన్ను ఒక్కటే తక్కువ.. మిగతా అంతా పర్ఫెక్ట్.
శ్రద్ధ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు.. ఇతర నటీనటులు టెక్నిషియన్స్ కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.