Begin typing your search above and press return to search.

చీరకట్టులో కూడా చిచ్చురేపుతున్న ముంబై సోయగం!

By:  Tupaki Desk   |   17 April 2021 5:30 PM GMT
చీరకట్టులో కూడా చిచ్చురేపుతున్న ముంబై సోయగం!
X
టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లామర్ బ్యూటీలలో ఒకరు శ్రద్దాదాస్. ముంబైకి చెందిన ఈ వయ్యారి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ముంబైలోనే పుట్టి పెరిగిన శ్రద్ధాకు చదువుకునే టైంలోనే యాక్టింగ్ వైపు అడుగులేసింది. 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించింది కూడా తెలుగు సినిమాతోనే. ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలే చేసింది కానీ తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ గ్లామర్ పరంగా కుర్రకారును మాయచేస్తోంది. అలాగని శ్రద్దా గ్లామర్ కేవలం తెలుగుకే అంకితం చేయలేదు. తమిళం కన్నడ మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. కానీ ఇన్నేళ్ళైనా అమ్మడు ఇంకా తనను తను ప్రూవ్ చేసుకునే దగ్గరే ఉండిపోయింది.

గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది కానీ మెయిన్ హీరోయిన్ గా కాదు. సెకండ్ లేదా సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. ప్రస్తుతం శ్రద్దా చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయట. నటిగా బిజీ కానప్పటికి గ్లామర్ బ్యూటీగా మాత్రం ఈ వయ్యారి చాలా ఫేమస్. దేశవ్యాప్తంగా క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలోనే శ్రద్దా అందాలకై ఎదురుచూసే ఫ్యాన్స్ మిలియన్స్ లో ఉంటారు. అందుకు తగ్గట్టుగానే శ్రద్దా.. కొద్దీ కొద్దీగా అందాలను కొసరుతూ ఫ్యాన్స్ ను మురిపిస్తుంది. ఇప్పటివరకు అమ్మడు కెరీర్ లో చేసిన అన్ని రొమాన్స్ తో కూడిన పాత్రలే చేసింది. తాజాగా శ్రద్దాదాస్.. తెలుగు లేటెస్ట్ మూవీ 'ఏక్ మినీ కథ'లో ఓ రోల్ చేసిందట. ఆ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతుండటంతో శ్రద్దా తాజాగా సారీలో పిక్స్ పోస్ట్ చేసింది. నిజంగా సారీలో అమ్మడి అందం రెట్టింపు అయిందనే చెప్పాలి. అదేవిధంగా గ్లామర్ ప్రియులకోసం అలా నడుము నాభి అందాలను కూడా కొసరింది. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.