Begin typing your search above and press return to search.

రివాల్వర్‌ రాణీకి కాపీ రాణి

By:  Tupaki Desk   |   20 Aug 2015 7:37 PM GMT
రివాల్వర్‌ రాణీకి కాపీ రాణి
X
కాపీ కథలు, కాపీ సీన్లు, కాపీ క్యారెక్టర్లు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. ఇప్పుడు వాటి గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే చందమామ కథలుతో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఇలా ఒక జాతీయ(హిందీ) సినిమాలోని క్యారెక్టర్‌ ని కాపీ చేసి యథాతథంగా ఉపయోగించడమేంటి? అన్న ప్రశ్నిస్తున్నారు కొందరు విమర్శకులు.

అతడు తెరకెక్కిస్తున్న 'గుంటూర్‌ టాకీస్‌'లో శ్రద్ధాదాస్‌ క్యారెక్టర్‌ ఓ లోకల్‌ డాన్‌. బజారులో షాపుల దగ్గరికి వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంది. గన్‌ చూపించి బెదిరిస్తూ డాన్‌ అంటూ కలర్‌ ఇస్తుంటుంది. అయితే ఇదంతా బాలీవుడ్‌ సినిమా రివాల్వర్‌ రాణీ క్యారెక్టర్‌ ని పోలి ఉంటుందని శ్రద్ధా స్వయంగా చెప్పింది. ఈ పాత్ర మాట తీరు కాస్త తేడాగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్‌ ఘర్ బార్డర్ల లో లాంగ్వేజ్‌ లా ఉంటుంది. అనంతపురంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. అక్కడ సీనియర్‌ నరేష్‌ సొంత ఇంట్లోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేశానని శ్రద్ధా చెప్పింది.

బాలీవుడ్‌ సినిమాకి కాపీ కాదు, కేవలం క్యారెక్టర్‌ వరకూ రివాల్వర్‌ రాణీని పోలి ఉంటుందని శ్రద్ధా కవరింగ్‌ చేసే ప్రయత్నమూ చేస్తోంది. మరి అలాంటప్పుడు మరో జాతీయ అవార్డు అందుకోవడమెలా ప్రవీణ్‌?