Begin typing your search above and press return to search.

స్పాటెడ్: వారు ఫ్లాపే.. వారి బ్యూటి కాదు

By:  Tupaki Desk   |   14 Oct 2016 3:30 PM GMT
స్పాటెడ్: వారు ఫ్లాపే.. వారి బ్యూటి కాదు
X
ఎప్పుడైనా అంతే కదా.. దాదాపు హీరోయిన్లు అందరూ అందంగానే ఉంటారు. కాని కొంతమంది హీరోయిన్లకు అవకాశాలు బాగా రావడం.. వాటిని సమయానికి అందిపుచ్చుకుని.. సరిగ్గా వాడుకుని.. వారు టాప్ పొజిషన్లోకి వచ్చేస్తారు. మిగతా వారు మాత్రం కొన్నాళ్ళు స్ర్టగుల్ అయి.. మనకు వచ్చింది ఇంతేలా అంటూ ఆశలు వదిలేసుకుంటారు.

అలా వదిలేకున్న భామలు ఇద్దరూ.. ఇంకా తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అంటూ అరకొరా పాత్రలో మెరుస్తున్న భామ మరొకరు.. ఇప్పుడు ముంబయ్ లో సమావేశం అయ్యారు. చూస్తున్నారు.. తన ఫేట్ ను ఇంకా టెస్ట్ చేసుకుంటున్న శ్రద్దా దాస్.. అలాగే ఇప్పటికే అవకాశాలు లేక ఏళ్ళ తరబడి ఖాళీగానే ఉన్న హీరోయిన్లు స్నేహ ఉల్లాల్ అండ్ పూనమ్ బజ్వా. వీరందరూ కూడా ముంబయ్ లోని ఒక కాఫీ షాపులో సమావేశం అయ్యారు. ఉత్తినే సరదాగా ఒక కాఫీ తాగి వెళ్ళిపోవడానికి అలా కలుసుకున్నారు.

వాళ్లను చూస్తే ఏమనిపిస్తోంది? సినిమా కెరియర్లో వారు ఫ్లాప్ అయినా కూడా.. ఆ అందంతో వారు ఎప్పటికీ సూపర్ హిట్ బ్యూటీల లిస్టులో చేరిపోతారు కదూ. చేరిపోవడం ఏంటి.. ఆల్రెడీ చేరిపోయారు కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/