Begin typing your search above and press return to search.

అవును.. మమ్మీనే అంటున్న శ్రద్ధా దాస్

By:  Tupaki Desk   |   25 March 2016 4:20 AM GMT
అవును.. మమ్మీనే అంటున్న శ్రద్ధా దాస్
X
చలకీగా చక్కర్లు కొడుతున్న ఓ మహిళను చూడగానే.. ఏ కాలేజ్ అని అడగడం.. అంతలోనే ఓ పాప మమ్మీ అంటూ.. పరిగెట్టుకురావడం అనే కాన్సెప్ట్ మనోళ్లకు చాలా కాలం నుంచే తెలుసు. ఇప్పుడు జనాలకు శ్రద్ధాదాస్ కూడా ఇలాంటి షాక్ నే ఇచ్చింది. శ్రద్ధాదాస్ పోస్ట్ చేసిన ఈ యాడ్ ని గుర్తు చేసింది.

రీసెంట్ గా శ్రద్ధాదాస్ తన మమ్మీ పుట్టినరోజును గ్రాండ్ గా నిర్వహించింది. ఆటైంలో అమ్మతో దిగిన ఫొటోలను ఆమె తన సోషల్‌ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది. సోషల్ నెట్ వర్క్ పేజ్ లో శ్రద్ధా దాస్ పోస్ట్ చేసిన ఫోటోను చూసి.. అచ్చు ఆమెలాగే ఉండడంతో... ఆమె ఈ హీరోయిన్ కి అక్క అనో, చెల్లి అనో అంతా అనుకున్నారు. అయితే ఆ ఫొటోలో ఉన్నది మా మమ్మీ అని శ్రద్ధా దాస్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 'ఆమె మీ అమ్మా' అంటూ రెట్టించి మరీ అడిగారు. 'అవునూ.. ఆమె మా అమ్మే.. అఫ్ కోర్స్. ఇదే ప్రశ్న నాకు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటుంది' అంటూ తిరిగి జవాబిచ్చింది శ్రద్ధా దాస్.

చూడటానికి అక్కాచెల్లెల్లా ఉన్న వీరిద్దరు తల్లికూతుళ్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. 'బర్త్‌ డే సందర్భంగా మా అమ్మతో షాపింగ్ కి వెళ్లి తనకు శారీస్ కొన్నాను. కలిసి డిన్నర్‌ కూడా చేశాక.. కేక్ కూడా కట్‌ చేసింది, బాగా ఎంజాయ్ చేశాం' అని శ్రద్ధాదాస్ అమ్మ బర్త్ డే సంగతులు అభిమానులతో పంచుకుంది.